జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్‌డ్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బాంబే ఆగస్టు 8న దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. జేఈఈ మెయిన్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష కోసం ఆగస్టు 8 నుంచి 11 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.



షెడ్యూలు ప్రకారం ఆగస్టు 28న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలను నిర్వహించనున్నారు. పరీక్షలో రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు మూడు గంటల సమయం కేటాయించారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్- 2022 కోసం ఆగస్టు 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రారంభ దశలో విదేశీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి మాత్రమే అనుమతించారు. ఇక భారతీయ విద్యార్థుల కోసం జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాల తర్వాత అప్లికేషన్ కమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించారు.

Also Read: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల - రిజల్ట్, ర్యాంక్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

అర్హతలు ఇవే..


✪ జేఈఈ మెయిన్స్ పేపర్-1 పరీక్షలో అర్హత సాధించిన అన్ని విభాగాల అభ్యర్థుల నుంచి 2.5 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలకు ఎంపికచేస్తారు.

✪ జేఈఈ అడ్వాన్స్‌డ్ -2022 పరీక్షకు 01.10.1997 తర్వాత జన్మించినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 5 సంవత్సరాల వయోసడలింపు వర్తిస్తుంది. వీరు 01.10.1992 తర్వాత జన్మించినవారై ఉండాలి.

✪ అభ్యర్థులకు వరుసగా కేవలం రెండు పర్యాయాలు మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసే అవకాశం ఉంటుంది.

✪ జేఈఈ అడ్వాన్స్‌డ్ -2022 పరీక్షలకు 2022 లేదా 2021 సంవత్సరాల్లో ఇంటర్ పాసై.. జేఈఈ మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

✪ అయితే 2019-20 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష ఫలితాలను 2020, అక్టోబరు 15 తర్వాత ప్రకటించినట్లయితే.. 2020లో ఇంటర్ ఉత్తీర్ణులైనవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.


Also Read: TS EAMCET Results: టీఎస్‌ ఎంసెట్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్, రిజల్ట్స్ ఎప్పుడంటే?

దరఖాస్తు ఫీజు వివరాలు..

✪ మహిళా అభ్యర్థులు (ఇండియా): రూ.1400.


✪ మిగతా అభ్యర్థులందరికీ: రూ.2800. 


✪ ఇండియాలో ఇంటర్ చదివిన  విదేశీ విద్యార్థులకు (సార్క్ దేశాలు): రూ.6000.


✪ ఇండియాలో ఇంటర్ చదివిన విదేశీ విద్యార్థులకు (సార్క్ దేశాలు): రూ.6,000.


✪ ఇతర దేశాల్లో ఇంటర్ చదివిన విదేశీ విద్యార్థులకు (నాన్ - సార్క్ దేశాలు): రూ.12,000.

ముఖ్యమైన తేదీలు..


✪ జేఈఈ అడ్వా్న్స్డ్ రిజిస్ట్రేషన్: 08.08.2022 - 11.08.2022.


✪ ఫీజు చెల్లించడానికి చివరితేది: 12.08.2022.


✪ అడ్మిట్‌కార్డుల డౌన్‌లోడ్: 23.08.2022 - 28.08.2022.


✪ జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 పరీక్ష తేది: 28.08.2022.


పరీక్ష సమయం: 


పేపర్-1: ఉ. 9.00 గం. - మ.12:00 గం. వరకు.


పేపర్-2: మ.14:30 - సా.17:30 గం. వరకు.


✪ ప్రాథమిక కీ: 03.09.2022.


✪ ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ: 01.09.2022 - 04.09.2022. 

✪ తుది ఆన్సర్ కీ: 11.09.2022.

✪ ఫలితాల వెల్లడి: 11.09.2022.

* ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2022

✪ రిజిస్ట్రేషన్ ప్రక్రియ: 11.09.2022 - 12.09.2022.

✪ జాయింట్ సీట్ అలొకేషన్ ప్రారంభం (JoSAA): 12.09.2022.

✪ ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్: 14.09.2022.

✪ ఫలితాల వెల్లడి: 17.09.2022



JEE (Advanced)-2022: Information Brochure

JEE (Advanced)-2022: Online Registration Portal


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..


ఉద్యోగ సంబంధ కధనాల కోసం క్లిక్ చేయండి..