GATE 2024 Answer Key: దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(GATE 2024) పరీక్ష తుది ఆన్సర్ కీని ఐఐఎస్సీ బెంగళూరు మార్చి 15న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. ఈ ఏడాది ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో దేశంలోని 200 నగరాల్లో గేట్ పరీక్షలను ఐఐఎస్సీ బెంగళూరు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రాథమిక ఆన్సర్ కీని ఐఐఎస్సీ బెంగళూరు ఫిబ్రవరి 19న విడుదల చేసింది. అభ్యర్థుల రెస్సాన్స్ షీట్లను కూడా విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 22 నుంచి 25 మధ్య అభ్యంతరాలు స్వీకరించింది. తాజాగా ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. గేట్-2024 ఫలితాలను మార్చి 16న ప్రకటించాల్సి ఉంది.


GATE 2024 Final Key కోసం క్లిక్ చేయండి..


గేట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 7 ఐఐటీలు (బొంబయి, ఢిల్లీ, గువాహటి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ)తోపాటు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్ ఆఫ్ సైన్స్, ఇతర ప్రభుత్వరంగ విద్యాసంస్థల్లో డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇతర ప్రైవేట్ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు కూడా గేట్ స్కోరునే ప్రవేశాలకు ప్రామాణికంగా తీసుకుంటాయి. కొన్ని ప్రభుత్వ సంస్థలు గేట్ స్కోరు ద్వారా ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తున్నాయి.


30 సబ్జెక్టులకు పరీక్ష..
దేశవ్యాప్తంగా దాదాపు 200 నగరాలు, పట్టణాల్లో పరీక్ష నిర్వహించారు. గేట్‌లో సాధించిన స్కోరును బట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అభ్యర్థులకు ముఖాముఖి నిర్వహించి, ఉద్యోగాలకు ఎంపిక చేస్తాయి.  'గేట్‌'లో ఇప్పటివరకు మొత్తం 29 ప్రశ్నపత్రాల్లో పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి కొత్తగా డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(డీఏ) ప్రశ్నపత్రాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీంతో గేట్ పరీక్షలో మొత్తం పేపర్ల సంఖ్య 30కి చేరినట్లయింది.


పరీక్ష విధానం..


✦ మొత్తం 30 సబ్జెక్టుల్లో గేట్ పరీక్ష నిర్వహిస్తారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాలతోపాటు.. ఇతర దేశాలలోని నగరాల్లో కూడా గేట్ పరీక్ష నిర్వహిస్తారు.


✦ ప్రకటించిన తేదీల్లో మొత్తం రెండు సెషన్లలో (9:30 am - 12:30 pm,  2:30 pm - 5:30 pm.) గేట్ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.


✦ ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే గేట్ పరీక్షలో 100 మార్కులకు 65 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి 10 ప్రశ్నలకుగాను 15 మార్కులు; టెక్నికల్, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ విభాగాల నుంచి 55 ప్రశ్నలకుగాను 85 మార్కులు ఉంటాయి.


✦ నెగెటివ్ మార్కులు కూడా ఉన్నాయి. 1 మార్కు ప్రశ్నలకు ప్రతి తప్పు సమాధానానాకి 1/3 చొప్పున, 2 మార్కుల ప్రశ్నలకు ప్రతి తప్పు సమాధానానాకి 2/3 చొప్పున కోత విధిస్తారు.


గతేడాది బ్రాంచ్‌లవారీగా కటాఫ్ మార్కులు ఇలా..


➥ కంప్యూటర్ సైన్స్ (సీఎస్): జనరల్ ➜ 25-30 మార్కులు, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ ➜ 22-27 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు ➜ 16-20 మార్కులు. 


➥ సివిల్ ఇంజినీరింగ్ (సీఈ): జనరల్ ➜ 25-32 మార్కులు, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ ➜ 22-28 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు ➜ 16-22 మార్కులు.


➥ మెకానికల్ ఇంజినీరింగ్ (ఎంఈ): జనరల్ ➜ 30-36 మార్కులు, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ ➜ 28-32 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు ➜ 20-25 మార్కులు.


➥ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ (ఈఈ): జనరల్ ➜ 25-32 మార్కులు, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ ➜ 22-30 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు ➜ 16-22 మార్కులు.


➥ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీ): జనరల్ ➜ 25-30 మార్కులు, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ ➜ 22-26 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు ➜ 16-22 మార్కులు.


➥ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీ): జనరల్ ➜ 25-30 మార్కులు, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ ➜ 22-26 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు ➜ 16-22 మార్కులు. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..