కర్నూలులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ & మాన్యుఫాక్చరింగ్ (ఐఐఐటీడీఎంకే)లో విశ్వేశరాయ ఫెలోఫిప్ స్కీమ్ కింద పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా ఫుల్ టైం, పార్ట్ టైం విధానంలో పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ విభాగాల్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగాల్లో ఎంఈ, ఎంటెక్, ఎంఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. 

వివరాలు..

* పీహెచ్‌డీ ప్రవేశాలు

విభాగాలు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అర్హతలు..

➥ ఇంజినీరింగ్ విభాగాలకు సంబంధిత విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ (ఎంఈ/ఎంటెక్) ఉండాలి. దీంతోపాటు గేట్ అర్హత తప్పనిసరిగా ఉండాలి. ఇంజినీరింగ్ డిగ్రీలో 8 సీజీపీఏ తప్పనిసరి. ఆర్ అండ్ డీ సంస్ధల నుండి కనీసం 60శాతం మార్కులలతో బీఈ, బీటెక్, పూర్తి చేసిన వారు సైతం అర్హులే.  ➥ ఫిజిక్స్ విభాగానికి 60 శాతం మార్కులతో పీజీ డిగ్రీతోపాటు గేట్/ సీఎస్‌ఐఆర్ నెట్ అర్హత ఉండాలి. ➥ మ్యాథమెటిక్స్ విభాగానికి 60 శాతం మార్కులతో పీజీ డిగ్రీతోపాటు గేట్/ సీఎస్‌ఐఆర్ నెట్/ఎన్‌బీహెచ్‌ఎం అర్హత ఉండాలి.   దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్ లిస్ట్ తర్వాత అభ్యర్థులకు రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.250 చెల్లించాలి. ఆన్‌లైన్ విధానంలో ఫీజు చెల్లించాలి.  ఫీజు చెల్లింపు ఖాతా వివరాలు..Indian Institute of Information Technology Design and Manufacturing, Kurnool, Account Number: 50100257542350, IFSC Code: HDFC0004159, Bank Name: HDFC Bank C Camp Center Branch Kurnool. ఫైనాన్షియల్ అసిస్టెన్స్: ఎంపికైనవారికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద  ఫుల్ టైం అభ్యర్ధులకు మొదటి రెండేళ్లకు నెలకు రూ.38,750, చివరి మూడేళ్లు నెలకు రూ.43,750 అందజేస్తారు. 

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 08.10.2023.

➥ అభ్యర్థుల షార్ట్‌లిస్ట్: 16.10.2023.

➥ రాతపరీక్ష/ఇంటర్వ్యూ: 27.10.2023 - 31.10.2023.

➥ ఫలితాల వెల్లడి: 03.11.2023.

➥ సీటు నిర్దారణ, ఫీజు చెల్లించడానికి చివరితేది: 10.11.2023.

➥ కళాశాలలో రిపోర్టింగ్: 13.11.2023.

Notification

Online Application

Website

ALSO READ:

నిట్‌ అరుణాచల్ ప్రదేశ్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, అర్హతలివేఅరుణాచల్ ప్రదేశ్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) విశ్వేశ్వరయ్య ఫెలోషిప్ పథకం 2023-24 కింద పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్‌ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్‌ గేట్/ నెట్ స్కోరు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 10లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.ప్రోగ్రామ్ వివరాల కోసం క్లిక్ చేయండి..

ఐఐటీ భువనేశ్వర్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, వివరాలు ఇలాభువనేశ్వర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విశ్వేశ్వరయ్య ఫెలోషిప్ పథకం 2023-24 కింద పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ, ఎంఈ, ఎంటెక్‌ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 5లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.ప్రోగ్రామ్ వివరాల కోసం క్లిక్ చేయండి..

తిరుపతి ఐఐటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, వివరాలు ఇలాతిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) 2023 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, బీఎస్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంఎస్‌, ఎంఎస్సీ, పీజీతో పాటు గేట్‌/ యూజీసీ- నెట్‌/ సీఎస్‌ఐఆర్‌- నెట్‌/ ఎన్‌బీహెచ్‌ఎం/ ఇన్‌స్పైర్‌లో అర్హత సాధించినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబరు 3లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...