కనకం పంతులు వేషం వేసుకుని రోడ్డు మీద నిలబడుతుంది. మైఖేల్ వచ్చి పంతులు సుబ్రమణ్యం గాడి అడ్రస్ ఎక్కడని అడుగుతాడు. దీంతో కర్ర తీసుకుని నాలుగు పీకుతుంది. నాభర్తని పట్టుకుని వాడు వీడు అని అంటావా ఉతుకుతుంది. భర్తకి బాగోలేదని తనే వచ్చి చేస్తానని అంటుంది. ఎన్ని చెప్పినా కూడా మైఖేల్ పురోహితుడు కావాలి పురోహితురాలు వద్దని అనేసరికి అయితే నీ పెళ్లి జరగదులే కనకం శాపం పెడుతుంది. కాసేపు ఇద్దరూ వాదులాడుకున్న తర్వాత పెళ్లి చేసేందుకు ఆమెని తీసుకుని వెళతాడు. మాటి మాటికి దరిద్రులు, చవట, సన్నాసి అని తెగ తిట్టేస్తుంది.


కావ్య హాస్పిటల్ లో ఏడుస్తూ తన అక్క మీద ఎవరికి అంత పగ ఉందోనని ఏడుస్తూ ఉంటుంది. కానీ రుద్రాణి మాత్రం వాళ్ళని డైవర్ట్ చేసేందుకు మాట్లాడుతుంది. రాహుల్ మీద, స్వప్న మీద పగ అని ఎందుకని అనుకుంటావ్ నీ మీద పగతో కూడా ఏమైనా తీసుకెళ్లారేమోనని అంటుంది. ఇక కొడుక్కి ట్యాబ్లెట్స్ ఇస్తానని చెప్పి రాహుల్ దగ్గరకి వెళ్తుంది.


రాహుల్; ఎలా ఉంది మమ్మీ నా ప్లాన్ అందరూ నమ్మేశారా?


Also Read: కన్నీళ్లతో జగతికి ప్రామిస్ చేసిన రిషి, శైలేంద్రకి మొదలైన కౌంట్ డౌన్!


రుద్రాణి: స్వప్న ఏమైందో తెలిసే వరకు ఎవరినీ నమ్మరు. పోలీసులని రమ్మని చెప్పారు. ఇప్పుడు పోలీసులు వస్తే ప్రాబ్లం ఏమి ఉండదు కదా


రాహుల్:ఎవరు వచ్చినా ఏమి కాదు ఆ స్వప్న ఎప్పుడో చచ్చిపోయింది


రుద్రాణి: అవునా.. ఇప్పుడు నా కోపం చల్లారింది. కోటీశ్వరుల అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటే తన అక్కకి ఇచ్చి పెళ్లి చేస్తదా? పీడ విరగడ అయ్యింది


కనకం కారు దిగి పొరపాటున మామూలుగా నడిచేసి వెళ్తుంటే మైఖేల్ పిలిచి అనుమానంగా చూస్తాడు. కూతుర్ని చూడాలనే తొందరలో ముసలిదాన్ని అనే విషయం మర్చిపోయానని నాలుక కోరుక్కుంటుంది. సంభావన వస్తుందని అనేసరికి ఎలాగైనా ఉంటానని కనకం కవర్ చేస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత పెళ్లి మండపం ఏదని అంటుంది. మైఖేల్ మెడలో దండ వేసుకుని పీటల మీద కూర్చోవడానికి తాళి పట్టుకుని సిద్ధంగా ఉంటాడు. స్వప్నని చూడగానే కనకం ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది. పీటల మీద కూర్చోమని మైఖేల్ పిలిస్తే తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని అంటుంది.


Also Read: ఒక్కటైన దివ్య, విక్రమ్- తులసి సేవలో నందు, హనీపై రత్నప్రభ పైశాచికత్వం!


కనకం స్వప్నని మెల్లగా పిలిచి అమ్మని అని సైగ చేసి చెప్తుంది. దీంతో స్వప్న ఒక్కసారిగా అమ్మా అంటూ గట్టిగా పిలుస్తుంది. అమ్మాయి మొహంలో నవ్వు లేదు ఏంటి బలవంతపు పెళ్ళా అని అడుగుతుంది. స్వప్న గురించి కావ్య వాళ్ళకి ఎలాగైనా చెప్పాలి, లొకేషన్ పంపించాలని కనకం ప్లాన్ వేస్తుంది. స్వప్నని ఫోన్ ఉందా అంటే లేదని చెప్తుంది. తెలివిగా మైఖేల్ దగ్గర ఫోన్ తీసుకుంటుంది. మైఖేల్ ఫోన్ నుంచి కావ్య నెంబర్ కి కనకం లొకేషన్ షేర్ చేస్తుంది. కాసేపటికి వీడియో కాల్ చేస్తుంది. మా ఆయన అనుమానిస్తాడని చెప్పి సైలెంట్ గా వీడియో కాల్ చేసి లైవ్ ఆన్ లో పెడుతుంది. ఫోన్ లో ఉందని కనకం అనే విషయాన్ని కావ్య గుర్తు పడుతుంది. బ్యాక్ కెమెరా ఆన్ చేస్తున్నా పెళ్లి కొడుకు మొహం చూడమని చెప్పి మైఖేల్, స్వప్నని చూపిస్తుంది. రాజ్ వాళ్ళు కంగారుగా వెళ్తుంటే శుభాష్ ఎక్కడికని అంటాడు. స్వప్న కోసం వెళ్తున్నామని చెప్పేసి టెన్షన్ గా వెళ్లిపోతారు.


తరువాయి భాగంలో..


రాహుల్ ఇంట్లో డ్రామా స్టార్ట్ చేస్తాడు. స్వప్న దూరం అయితే బతకలేనని చచ్చిపోతానని ఇంట్లో అందరి ముందు చెప్తూ ఉంటాడు. అప్పుడే రాజ్ వాళ్ళు స్వప్నని తీసుకుని ఎంట్రీ ఇస్తారు. తనని చూసి రాహుల్ వాళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. స్వప్నని ఎవరు తీసుకెళ్లారో తెలిసిందా అంటే తెలిసిందని అనేసరికి రాహుల్ వణికిపోతాడు.