రాజస్థాన్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్ (ఐఐసీడీ) సంస్థ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ కోర్సులకు ఇంటర్, మాస్టర్స్ కోర్సులకు సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హత ఉండాలి. సరైన అర్హతలున్న అభ్యర్థులు డిసెంబరు 28లోగా ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష ఆధారంగా సీట్లను భర్తీచేస్తారు.
వివరాలు...
➥ బ్యాచిలర్ ప్రోగ్రామ్ (బీ.డీఈఎస్)
సీట్ల సంఖ్య: 180
కోర్సువ్యవధి: నాలుగేళ్లు
➥ మాస్టర్ ప్రోగ్రామ్ (ఎం.డీఈఎస్)
సీట్ల సంఖ్య: 90
కోర్సువ్యవధి: రెండేళ్లు
➥ మాస్టర్ ప్రోగ్రామ్ (ఎం.వీఓసీ)
సీట్ల సంఖ్య: 90
కోర్సువ్యవధి: మూడేళ్లు
విభాగాలు: హార్డ్ మెటీరియల్ డిజైన్, సాఫ్ట్ మెటీరియల్ డిజైన్, ఫైర్డ్ మెటీరియల్ డిజైన్, ఫ్యాషన్ క్లాతింగ్ డిజైన్, జ్యువెలరీ డిజైన్, క్రాఫ్ట్స్ కమ్యూనికేషన్
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10 + 2, డిజైన్, ఆర్కిటెక్చర్‌లో ఏదైనా డిగ్రీ , ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 28.12.2023.
➥ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: 30.12.2023.
➥ పరీక్ష తేదీ: 07.01.2024.
➥ ఫలితాలు: 12.01.2024.
➥ తరగతుల ప్రారంభం: 2024 జులై నుంచి
ALSO READ:
ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సులు, ప్రవేశాలు ఇలా
గుంటూరులోని ఆచార్య ఎన్.జి. రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ, 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. పీజీ కోర్సులకు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సులకు సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ అర్హత ఉన్నవారు అర్హులు. ఈ కోర్సుల ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 13న ప్రారంభంకాగా.. నవంబరు 3 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పీజీ కోర్సులకు డిగ్రీ మార్కులు, ఏఐఈఈఏ (ఐకార్) స్కోరు; పీహెచ్‌డీ కోర్సులకు డిగ్రీ, పీజీ మార్కులు, ఏఐసీఈ (ఐకార్) స్కోరు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.1500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.750 చెల్లిస్తే సరిపోతుంది.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..
నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీలో పీజీడీఎం ప్రోగ్రామ్, ఈ అర్హతలుండాలి
పుణెలోని నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ, 2024 విద్యా సంవత్సరానికి పీజీడీఎం ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు క్యాట్, ఎక్స్‌ఏటీ, సీమ్యాట్ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. విద్యార్హతలు, పని అనుభవం, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..
ఓయూలో దూరవిద్య ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్య కేంద్రంలో డిగ్రీ, పీడీ, డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబరు 20 వరకు అవకాశం ఉందని డైరెక్టర్ ప్రొఫెసర్ బీబీ రెడ్డి తెలిపారు. యూకేపీ ఆదేశాల మేరకు దరఖాస్తుల గడువును పొడిగించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటిదాకా దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అక్టోబరు 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..