Telangana BC Study Circles | హైదరాబాద్: విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారికి అంతర్జాతీయ స్కాలర్షిప్ లు పొందేలా స్టడీ సర్కిల్ లో శిక్షణ అందించనున్నామని బీసీ స్టడీ సర్కిల్స్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తెలంగాణలోని బీసీ, ఇతర విద్యార్ధులకు విదేశాలలో ఉన్న అత్యున్నత విశ్వ విద్యాలయాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు గల అవకాశాలు మెరుగు పరచడం, విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఇచ్చే అంతర్జాతీయ స్కాలర్షిప్లు పొందడం లక్ష్యంగా నిర్మాణాత్మక అవగాహన సెషన్లు, శిక్షణా కార్యక్రమాలను తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ప్రారంభించనుంది. ఈ విషయాన్ని తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్స్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని 12 బి.సి స్టడీ సర్కిల్స్ నందు విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు గల అవకాశాలను వివరించేందుకు అవగాహన కార్యక్రమాలతో పాటు IELTS శిక్షణ తరగతులు ప్రారంభిస్తామని వెల్లడించారు.
Also Read: Nuclear Bomb: అణు బాంబు దాడి జరిగి ప్రపంచమంతా నాశనమైనా ఈ జీవులు మాత్రం బతికేస్తాయి!
పైన తెలిపిన అవగాహన కార్యక్రమాలతో పాటు IELTS శిక్షణ తరగతులుకు హాజరు అవ్వుటకు ఆసక్తి వున్న గ్రాడ్యుయేషన్ (ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్) ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు తేది డిసెంబర్ ఒకటో తేదీ (01.12.2025) నుండి డిసెంబర్ 21 వరకు తేదీ వరకు టి.జి.బి.సి.స్టడీ సర్కిల్ వెబ్సైట్ www.tgbcstudycircle.cgg.gov.in ద్వారా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మరింత సమాచారం కోసం 040-24071178 నెంబర్‌లో సంప్రదించి తెలుసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్స్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.