కంపెనీ సెక్రటరీ ప్రొఫెషనల్, ఎగ్జిక్యూటివ్ డిసెంబరు-2022 పరీక్ష ఫలితాలను 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా' ఫిబ్రవరి 25న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రూల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబరు వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. గతేడాది డిసెంబరు 21 నుంచి 30 వరకు సీఎస్ పరీక్షలు నిర్వహించారు. ఫలితాల్లో చిరాగ్ అగర్వాల్ మొదటి ర్యాంకు కైవసం చేసుకోగా..  ఎస్ స్వాతి రెండో ర్యాంకు, రియాబాగ్ చందనీ మూడోర్యాంకులో నిలిచారు.


ఫలితాలు ఇలా చూసుకోండి...


స్టెప్-1: ఫలితాల కోసం అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.


స్టెప్-2: అక్కడ హోంపేజీలో కనిపించే 'CS Professional, Executive December 2022 Result' లింక్ మీద క్లిక్ చేయాలి. 


స్టెప్-3: అక్కడ కనిపించే లాగిన్ పేజీలో రూల్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు నమోదుచేయాలి.


స్టెప్-4: ఐసీఎస్‌ఐ సీఎస్ డిసెంబరు 2022 ఫలితాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి. 


స్టెప్-5: ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకొని భవిష్యత్ అవసరాల కోసం దాచుకోవాలి.


సీఎస్ (ప్రొఫెషనల్, ఎగ్జిక్యూటివ్) ఫలితాాల కోసం క్లిక్ చేయండి..


టాపర్లు వీరే..





Also Read:


విద్యార్థులకు అలర్ట్, ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కుల వెయిటేజీపై కీలక నిర్ణయం!
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కుల వెయిటేజీని రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది కూడా ఎంసెట్‌ ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించింది. అయితే ఇంటర్‌లో కనీస మార్కులు సాధించాలన్న నిబంధనను యథాతథంగా కొనసాగిస్తున్నట్టు వెల్లడించింది. దీంతో ఇంటర్‌లో జనరల్‌ విద్యార్థులు 45 శాతం, రిజర్వ్‌డ్‌ క్యాటగిరీ విద్యార్థులు 40 శాతం మార్కులు సాధిస్తేనే ఎంసెట్‌కు హాజరుకావొచ్చని సూచించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...


తెలంగాణ పీజీఈసెట్ షెడ్యూలు విడుద‌ల, పరీక్ష ఎప్పుడంటే?
హైద‌రాబాద్‌లోని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ టెక్నాల‌జిక‌ల్ యూనివ‌ర్సిటీ (జేఎన్‌టీయూహెచ్) 'టీఎస్ పీజీఈసెట్' షెడ్యూలును ఫిబ్రవరి 24న విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 2023-24 విద్యా సంవ‌త్సరానికి ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలు క‌ల్పించ‌నున్నారు. టీఎస్ పీజీఈసెట్‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ ఫిబ్రవ‌రి 28న విడుద‌ల కానుంది. మార్చి 3 నుంచి ఆన్‌లైన్‌లో అర్హులైన అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు
పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..


మేనేజ్‌మెంట్ విద్యకు సరైన మార్గం ‘మ్యాట్’, ఫిబ్రవరి 2023 నోటిఫికేషన్ విడుదల!
ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేట్‌ (ఏఐఎంఏ)-2023 ఫిబ్రవరి సెషన్‌ మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (MAT) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ, ఇతర ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏఐఎంఏ మ్యాట్‌ను ఏటా నాలుగుసార్లు (ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్) నిర్వహిస్తుంది. మ్యాట్ 2022 ఫిబ్రవరి నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది.
దరఖాస్తు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..  


సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష 2023 ఫలితాలు విడుదల
దేశంలోని 33 సైనిక స్కూళ్లలో 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 9వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన 'ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్-2023'  (AISSEE-2023) ఫలితాలు వెలువడ్డాయి. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జనవరి 8న పెన్ పేపర్ (ఓఎంఆర్ షీట్) విధానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఫలితాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..