ఛార్టర్డ్ అకౌంటెంట్ ఫౌండేషన్ డిసెంబరు 2022 పరీక్షల షెడ్యూలును ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో షెడ్యూలను అందుబాటులో ఉంచింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబరు 14 నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. డిసెంబరు 14, 16, 18, 20 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-1, పేపర్-2 పరీక్షలు నిర్వహిస్తారు. అయితే మధ్యాహ్నం 1.45 గంటలకే ప్రశ్నపత్రం ఇస్తారు. విద్యార్థులు ప్రశ్నపత్రం చదువుకోవడానికి ఈ 15 నిమిషాల అదనపు సమయం ఉంటుంది. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్-3, పేపర్-4 పరీక్షలు నిర్వహిస్తారు. ఎలాంటి అదనపు సమయం ఉండదు. పేపర్-1, పేపర్-2 పరీక్షల సమయం 3 గంటలు కాగా.. పేపర్-3, పేపర్-4 పరీక్షల సమయం 2 గంటలుగా నిర్ణయించారు.
పరీక్ష ఫీజు..
సీఏ ఫౌండేషన్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మొత్తం నాలుగు పేపర్లకుగాను పరీక్ష ఫీజుగా భారతీయ విద్యార్థులు రూ.1500 చెల్లించాలి. ఓవర్సీస్ విద్యార్థులు 325 యూఎస్ డాలర్లు పరీక్ష ఫీజుగా చెల్లించాలి. ఇక భూటాన్, ఖాట్మాండ్ దేశాలకు చెందినవారైతే రూ.2200 చెల్లించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలివే..
ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. సెప్టెంబరు 14 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అక్టోబరు 4 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రూ.600 లేదా 10 యూఎస్ డాలర్ల ఆలస్య రుసుముతో అక్టోబరు 9 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: ఏపీలో అనంతపురం, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. తెలంగాణలో ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్.
Also Read:
సీయూఈటీ యూజీ ఫలితాలు వచ్చేస్తున్నాయ్, ఎప్పుడంటే?
దేశంలోని వివిధ ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష(సీయూఈటీ)-యూజీ ఫలితాలు సెప్టెంబర్15వ తేదీలోగా వెలువడుతాయని యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు. డిగ్రీ కోర్సులకు తొలిసారిగా నిర్వహించిన ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు జులైలో ప్రారంభమై ఆగస్టు 30న ముగిశాయి. ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) సెప్టెంబర్15 నాటికి వెల్లడిస్తుందని, సాధ్యమైతే ఆ తేదీ కన్నా రెండు రోజులు ముందే ప్రకటించే అవకాశం ఉందన్నారు.
ఫలితాల పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..
Also Read:
KNRHUS: కాళోజీ హెల్త్ వర్సిటీ పరీక్షలు వాయిదా, కొత్త తేదీలివే!
తెలంగాణలోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వ విద్యాలయం పరిధిలో సెప్టెంబరు 9న జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విశ్వవిద్యాలయ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వెల్లడించారు. గణేశ్ నిమజ్జనం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు 9న సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేశారు. ఎంబీబీఎస్ రెండో సంవత్సరం, బీడీఎస్ చివరి సంవత్సరం, పోస్ట్ బేసిక్ నర్సింగ్ మొదటి సంవత్సరం పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వాయిదా పడిన ఎంబీబీఎస్ మైక్రో బయాలజీ పరీక్ష సెప్టెంబరు 19న, బీడీఎస్ పెరియోడొంటాలజీ సెప్టెంబరు 21న, పోస్ట్ బేసిక్ నర్సింగ్ ఇంగ్లిష్ పరీక్షను సెప్టెంబరు 30న నిర్వహించనున్నారు. అయితే, సెప్టెంబరు 12 నుంచి జరగాల్సిన పరీక్షలన్నీ యధావిధిగా జరుగుతాయని విశ్వవిద్యాలయ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వెల్లడించారు.
పరీక్ష కొత్తతేదీల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..