ICAI CA Inter, Final Results 2023: ఐసీఏఐ సీఏ ఇంటర్, ఫైనల్ నవంబరు-2023 ఫలితాలను ఇన్‌స్టిట్యూట్ ఆప్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) జనవరి 9న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ రూల్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. గతేడాది నవంబరు 2, 4, 6, 8 తేదీల్లో గ్రూప్-1 సీఏ ఇంటర్ పరీక్షలను, నవంబరు 10, 13, 15, 17 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు ఐసీఏఐ నిర్వహించింది. అదేవిధంగా సీఏ ఫైనల్ గ్రూప్-1 పరీక్షలను నవంబరు 1, 3, 5, 7 తేదీల్లో; గ్రూప్-2 పరీక్షలను నవంబరు 9, 11, 14, 16 తేదీల్లో నిర్వహించింది.


సీఏ ఇంటర్, ఫైనల్ ఫలితాలు ఇలా చూసుకోండి..


Step 1: ఫలితాల కోసం విద్యార్థులు మొదట అధికారిక వెబ్‌‌సైట్‌‌లోకి వెళ్లాలి. - https://www.icai.org/


Step 2: అక్కడ హోంపేజీలో కనిపించే 'CA Final November 2023 Result' & 'CA Inter November 2023 Result' ఫలితాల లింక్ మీద క్లిక్ చేయాలి.


Step 3: లాగిన్ వివరాలతో వచ్చే పేజీలో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, రూల్ నెంబరు వివరాలు నమోదుచేయాలి. 


Step 4: వివరాలు నమోదుచేసి క్లిక్ చేయగానే, సీఏ ఇంటర్, ఫైనల్ ఫలితాలు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి. 


Step 5: ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం భద్రవపరచుకోవాలి. 


సీఏ ఇంటర్, ఫైనల్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..


సీఏ ఫైనల్ ఫలితాల్లో జైపూర్‌కు చెందిన మధుర్ జైన్ ఆల్ ఇండియా టాపర్‌గా నిలిచాడు. మధుర్ జైన్ 800కిగాను 619 మార్కులతో (77.38 శాతం) ఉత్తీర్ణత సాధించాడు. రెండో స్థానంలో ముంబయికి చెందిన సంస్కృతి అతుల్ పరోలియా (599 మార్కులు - 74.88 %) నిలిచాడు. ఇక మూడో స్థానంలో జైపూర్‌కు చెందిన తికేంద్రకుమార్ సింఘాల్, రిషి మల్హోత్రా నిలిచారు. ఇద్దరు కూడా 590 మార్కులతో (73.75 %) సంయుక్తంగా మూడోస్థానంలో నిలవడం విశేషం. 


సీఏ ఫైనల్ పరీక్షలకు సంబంధించి గ్రూప్-1 పరీక్షల్లో 6,176 మంది విద్యార్థులు; గ్రూప్-2 పరీక్షల్లో 13,540 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఇక రెండు గ్రూపుల పరీక్షలకు సంబంధించి 3099 మంది విద్యార్థులు అర్హత సాధించారు. గ్రూప్-1 పరీక్షల్లో 9.46 శాతం విద్యార్థులు అర్హత సాధించగా, గ్రూప్-2 పరీక్షల్లో 21.6 శాతం విద్యార్థులు, రెండు గ్రూపులకు సంబంధించి 9.42 శాతం విద్యార్థులు అర్హత సాధించారు.



సీఏ ఇంటర్ ఫలితాల్లో ముంబయికి చెందిన జై దేవాంగ్ టాపర్‌గా నిలిచాడు. జై దేవాంగ్ 800కిగాను 691 మార్కులతో (86.38 శాతం) ఉత్తీర్ణత సాధించాడు. రెండో స్థానంలో అహ్మదాబాద్‌కు చెందిన భగేరియా తనెయ్ 688 మార్కులతో (86 శాతం), సూరత్‌కు చెందిన రిషి హిమాన్షుకుమార్ మేవావాలా 668 మార్కులతో (83.50 శాతం) మూడోస్థానంలో నిలిచాడు.   


సీఏ ఇంటర్ పరీక్షలకు సంబంధించి గ్రూప్-1 పరీక్షల్లో 19,686 మంది విద్యార్థులు; గ్రూప్-2 పరీక్షల్లో 17,957 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఇక రెండు గ్రూపుల పరీక్షలకు సంబంధించి 5204 మంది విద్యార్థులు అర్హత సాధించారు. గ్రూప్-1 పరీక్షల్లో 16.78 శాతం విద్యార్థులు అర్హత సాధించగా, గ్రూప్-2 పరీక్షల్లో 19.18 శాతం విద్యార్థులు, రెండు గ్రూపులకు సంబంధించి 9.73 శాతం విద్యార్థులు అర్హత సాధించారు.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..