HEAL School Admissions: తల్లితండ్రులను కోల్పోయి లేదా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయి నిరాదరణకు గురయ్యే చిన్నారులకు ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలోని 'హీల్ ప్యారడైజ్' పాఠశాల చేయూతనిస్తోంది. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి 12 కి.మీ. దూరంలో 60 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏర్పాటైన ఈ పాఠశాలలో అనాథ పిల్లలకు ఉచిత విద్యతోపాటు.. వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. కార్పొరేటు పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తీర్చిదిద్దారు. దేశంలో ఏ ప్రాంతంవారైనా ఇక్కడ చేరవచ్చని.. హీల్ ప్యారడైజ్ పాఠశాల నిర్వాహకుడు డాక్టర్ కోనేరు సత్యప్రసాద్, కార్యదర్శి తాతినేని లక్ష్మి, సీఈవో కె.అజయ్ కుమార్ తెలిపారు.


1 నుంచి ఇంటర్ వరకు ఇక్కడే..
ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లిష్ మీడియంలో సీబీఎస్‌ఈ పాఠ్య ప్రణాళికతో నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. ఇంటర్ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవారికి ప్రవేశ పరీక్షలు నిర్వహించి అర్హులైన విద్యార్థులకు యాప్ డెవలప్‌మెంట్, కంటెంట్ డిజైన్, సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో తగు శిక్షణ ఇస్తారు.  


ఏప్రిల్ 1 నుంచి 15 వరకు దరఖాస్తులు..
సమాజంలో నిరాదరణకుగురైన నిరుపేద చిన్నారులకు ఒకటి నుంచి 5వ తరగతి వరకు ఉచితంగా ప్రవేశాలు కల్పిస్తారు. సీట్లు పొందినవారు 10వ తరగతి వరకు అదేపాఠశాలలో చదువుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా టాలెంట్ టెస్ట్ ద్వారా ఎంపికైన విద్యార్థులకు ఇంటర్ మొదటిసంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. 2024-25 సంవత్సరానికి ప్రవేశాలు కోరువారు ఏప్రిల్ 1 నుంచి 15 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం 9100024438, 9100024435 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.


అన్నీ ప్రత్యేకమే..
ఈ పాఠశాలలో చెప్పుకోదగ్గ వాటిలో ముఖ్యమైనది క్యాంపస్‌లో ఏర్పాటుచేసిన లైబ్రరీ. ఈ గ్రంథాలయంలో 15 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థుల ఆసక్తి మేరకు వివిధ కళల్లో ప్రోత్సహిస్తున్నారు. త్రీడీ-చిత్రలేఖనం, క్రాఫ్ట్, సంగీతం, నాట్యం తదితర అంశాల్లో శిక్షణనిస్తారు. వీటితోపాటు అంతర్జాతీయ ప్రమాణాలతో 400 మీటర్ల ట్రాక్, బాస్కెట్‌బాల్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, హ్యాండ్‌బాల్ కోర్టులు కూడా ఉన్నాయి. బాలబాలికలకు వేర్వేరుగా ఆధునిక హంగులతో వసతి గృహాలు ఏర్పాటుచేశారు. ఈ పాఠశాలలో ఇంటర్ పూర్తిచేసుకున్న విద్యార్థుల ఉన్నత చదువులకు కూడా హీల్ ప్యారడైజ్ సంస్థనే సహకారం అందిస్తోంది. విద్యార్థుల కోసం పాఠశాల ప్రాంగణంలోనే హాస్పిటల్‌ సైతం ఏర్పాటుచేశారు.


Website


ALSO READ:


KVS Admissions: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు షెడ్యూలు విడుదల, ముఖ్యమైన తేదీలివే
దేశవ్యాప్తంగా ఉన్న కేవీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి 1 నుంచి 11వ  తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కేవీఎస్) షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ మేరకు మార్చి 28న అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. విద్యార్థులు ఏప్రిల్ 15న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకటో తరగతిలో ప్రవేశం పొందాలనుకొనే చిన్నారుల వయసు మార్చి 31, 2024 నాటికి 6 సంవత్సరాలు నిండి ఉండాలి. మిగతా తరగతులకు కూడా నిబంధనల మేరకు వయోపరిమితి వర్తిస్తుంది. 
ప్రవేశ వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..