Half-days And Summer Holidays 2025 : మార్చి 15 నుంచి ఏపీ తెలంగాణలో ఒంటిపూట బడులు- హాలిడే షెడ్యూల్ వచ్చేసింది
Half-days And Summer Holidays 2025 In Telugu states: తెలుగు రాష్ట్రాల్లో ఒంటిపూట బడులు, వేసవి సెలవుల షెడ్యూల్ వచ్చేసింది. ఎండల ముదిరిపోవడంతో విద్యాశాఖలు దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశాయి.
Half-days And Summer Holidays 2025 In Telangana And Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అప్పుడే ఎండలు దంచికొడుతున్నాయి. పది తర్వాత బయటకు రావాలంటే ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా స్కూళ్లకు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అందుకే ప్రభుత్వం ఒంటిపూట బడుల షెడ్యూల్ ప్రకటించింది. మార్చి 15 నుంచి రాష్ట్రంలో అన్ని పాఠశాలలు ఒకపూట పని చేయనున్నాయి.
ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడతారన్న కారణంతో విద్యాశాఖలు ఈ నిర్ణయం తీసుకుంది.
Just In
అన్ని ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్స్ అన్ని కూడా ఒక పూట పని చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం, ప్రైవేటు, ఎయిడెడ్ అన్ని విద్యాసంస్థల ఇది అమలు కావాలని అధికారులు ఆదేశించారు. ఒంటిపూట బడులతో స్కూల్స్ టైమింగ్స్ మారనున్నాయి.
ఒంటిపూటబడుల సమయంలో స్కూల్స్ ఉదయం 8:00లకు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 12:30 గంటలకే పూర్తి అవుతాయి. విద్యార్థుల సంరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు.
ఒంటిపూట బడులు మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు అమలులో ఉంటాయి. ఆ తర్వాత వేసవి సెలవులు ప్రకటిస్తారు. ఈ వేసవి సెలవులు ఏప్రిల్ 23 నుంచి జూన్ 11 వరకు ఇచ్చారు. ఆ తర్వాత జూన్ 12 నుంచి 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది.
ఈసారి ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే స్టూడెంట్స్, ఉపాధ్యాయులు, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.