Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode సరయు హోలీ పార్టీకి మిత్ర, మనీషాతో పాటు అందరూ వస్తారు. సరయు పార్టీలో మాట్లాడుతూ ఓ జంట పెళ్లి చేసుకోబోతుందని చెప్తుంది. అందరూ సర్‌ప్రైజింగ్‌గా ఫీలవుతారు. లక్ష్మీ మాత్రం మనీషా మిత్రల గురించే అనుకుంటుంది. షాక్ అవుతుంది. పెళ్లి ఏర్పాట్లు అన్నీ చేసేశానని కొంత టైంలో మీ అందరికీ జంట ఎవరో తెలుస్తుందని అందరూ అక్షింతలు వేయడానికి రెడీగా ఉండండి అంటుంది. లక్ష్మీ టెన్షన్ పడుతుంది.
మనీషా లక్ష్మీ దగ్గరకు వెళ్లి ఊహించలేదు కదా ఎలా ఉంది నా ఐడియా. మీ అందరూ లేకుండా నేను పెళ్లి చేసుకుంటే మజా ఉండదు అని మీరంతా రావడం వల్ల నాకు కిక్ వచ్చిందని అంటుంది. మిత్ర నా వాడే అవుతాడని మనీషా అంటుంది. మిత్ర పక్కన నేను ఉండగా నీ పెళ్లి జరగదు అని లక్ష్మీ అంటే మీరంతా చూస్తుండగానే జరుగుతుందని నువ్వు చూస్తుండగానే పెళ్లి జరుగుతుందని నీ కౌంట్ డౌన్ మొదలైందని మనీషా లక్ష్మీకి చెప్తుంది. ఏం చేసినా పెళ్లి ఆపలేవని ఛాలెంజ్ చేస్తుంది. లక్ష్మీ బాధతో కన్నీరు పెట్టుకుంటుంది.
జాను పిల్లల గురించి ఆలోచిస్తూ బాధ పడుతుంటే వివేక్ చూసి జాను దగ్గరకు వెళ్లి జాను మా అమ్మకి కలర్స్ రాయకు తనకు కలర్ అంటే నచ్చదు నా మీదే ఒక సారి అరిచిందని అంటాడు. జాను తన మూడ్ బాలేదని వదిలేయమని అంటుంది. దాంతో వివేక్ కొబ్బరి రేకులతో చేసిన బొమ్మలను తీసుకొచ్చి ఓ ఫ్యామిలీ అని చెప్పి జాను మూడ్ మార్చి నవ్విస్తాడు. జాను, వివేక్ అని వాళ్ల ఇద్దరు పిల్లలు అని నవ్విస్తాడు. జాను వాటిని తీసుకొని చాలా సంతోషపడుతుంది. ఆనందంలో భర్తని హగ్ చేసుకుంటుంది. లక్ష్మీ, మిత్ర, దేవయాని, మనీషా అందరూ చూస్తారు. దేవయాని వీళ్లకి సిగ్గు లేదు అనుకుంటుంది. లక్ష్మీ సంతోషంగా నవ్వుతుంటే మనీషా చూసి సరయుతో లక్ష్మీని మళ్లీ టెన్షన్ పెట్టాలి నువ్వు వెళ్లి మళ్లీ ప్రోగ్రామ్ మొదలు పెట్టు అంటుంది. పెళ్లి చేసుకోబోతున్న జంటని పరిచయం చేస్తున్నా అని సరయు అంటూ లక్ష్మీ చాలా టెన్షన్ పడుతుంది. పెళ్లి చేసుకోబోతున్న జంట మిత్ర, మనీషా అని అనౌన్స్ చేస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. వెంటనే సరయు సారీ సారీ వాళ్లు కాదు పెళ్లి చేసుకోబోయే జంటని మిత్ర, మనీషా పరిచయం చేస్తారు అని ఇద్దరిని మీదకు పిలుస్తుంది.
జయదేవ్ లక్ష్మీతో మనీషా ఏదో ప్లాన్ చేసినట్లుందని అంటాడు. అలాంటిది ఏం లేదని లక్ష్మీ అంటుంది. ఇక అందరికీ వెల్‌కమ్ డ్రింక్స్ ఇస్తారు. మిత్రకి డ్రింక్ తాగమని రాజు గారు ఇస్తే సరయు మనీషా తాగమని ఫోర్స్ చేస్తారు. మిత్ర తీసుకొని తాగే టైంకి లక్ష్మీ వచ్చి ఆపి తాను తాగేస్తుంది. సరయు, మనీషా షాక్ అయిపోతారు. తర్వాత లక్ష్మీ తాగమని మిత్రకు ఇస్తుంది. దాంతో ఏంటి లక్ష్మీ నా మీద నమ్మకం లేదా టేస్ట్ చేసి ఇస్తున్నావ్ అంటుంది. మనీషా లక్ష్మీతో పెళ్లి చేసుకోబోయే ఆ జంట ఫేక్ అని తాను మిత్రనే పెళ్లి చేసుకుంటామని అంటుంది. హోళీ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. వివేక్, జాను అందరూ రంగులు పూసుకుంటారు. దేవాయాని మీద రంగులు పూయడానికి కొందరు వస్తే దేవయాని వాళ్లని తిడతారు. లక్ష్మీ, మిత్రలు కూడా రంగులు పూసుకుంటారు. ఇక మనీషా రంగు తీసుకెళ్లి లక్ష్మీ, మిత్రలకు పూస్తుంది. ఇక మిత్ర దగ్గరకు తన ఫ్రెండ్ వచ్చి ఓ వైపు నీ భార్య మరోవైపు నీ లవర్ ఇద్దరితో నీకు ప్రతీ రోజు పండగే కదా అని అంటాడు. మిత్ర కోపంతో వాడి మీద చేయి చేసుకోగా లక్ష్మీ కూల్ చేసి పక్కకు తీసుకెళ్తుంది. మనీషా తన ఆయుధాన్ని వాడి మిత్ర తప్ప అందరినీ పంపేస్తానని అంటుంది. లక్ష్మీ దగ్గరకు బొకే తీసుకెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్ ఇంట్లో ఆస్తి పంపకాల రచ్చ.. కార్తీక్ నిర్ణయానికి కుస్తీలు పడుతున్న తండ్రి!