గీతం విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు నిర్వహించే గీతం ప్రవేశ పరీక్ష (గాట్‌ -23)కు దరఖాస్తు గడువు మార్చి 26తో ముగియనుంది. ఇప్పటివరకు  దరఖాస్తు చేసుకోలేని విద్యార్థులు ఫీజును రూ.1200గా నిర్ణయించారు. దరఖాస్తు చేసుకున్న వారికి మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 3 వరకు దేశవ్యాప్తంగా 48 నగరాల్లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలను నిర్వహించనున్నారు. గాట్‌-23తోపాటు జేఈఈ మెయిన్‌, ఏపీ, తెలంగాణ ఎంసెట్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు వైజాగ్‌, హైదరాబాద్‌, బెంగళూరుల్లోనూ గీతం క్యాంపసులలో సీట్లు కేటాయించనున్నారు. 


గీతం వర్సిటీలో ఈ విద్యా సంవత్సరం నుంచి లిబరల్‌ ఆర్ట్స్ కోర్సులను ప్రవేశపెట్టినట్లు వీసీ తెలిపారు. అమెరికాలో విస్తృత ప్రాచుర్యం పొందిన ఈ కోర్సులో భాగంగా బీటెక్‌ విద్యార్థి, మైనర్‌గా తన కోర్సుతో సంబంధం లేని సైకాలజీ సబ్జెక్టును తీసుకోవచ్చని వెల్లడించారు. ఇలా సైన్స్‌, మేనేజ్‌మెంట్‌, హ్యుమానిటీస్‌, సోషల్‌ సైన్సెస్‌ 25 విభాగాల్లో మేజర్‌, మైనర్‌ సబ్జెక్టులను విద్యార్థులు ఎంచుకోవచ్చు. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే ఫోన్: 8880884000 లేదా ఈమెయిల్: gat@gitam.edu ద్వారా సంప్రదించవచ్చు.


* గీతం ప్రవేశ పరీక్ష (గాట్‌-2023)


కోర్సులు: ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్, హ్యుమానిటీస్‌ & సోషల్‌ సైన్సెస్‌, లా, మేనేజ్‌మెంట్, మెడిసిన్, నర్సింగ్, పారామెడికల్, ఫార్మసీ, ఫిజియోథెరపీ, పబ్లిక్ పాలసీ, సైన్స్ తదితర విభాగాల్లో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, డిప్లొమా, స్పెషల్ సర్టిఫికేట్ కోర్సులు ఉన్నాయి. 


అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సులకు 60 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. పీజీ కోర్సులకు కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ప్రవేశపరీక్ష ర్యాంకు ఆధారంగా.


దరఖాస్తు ఫీజు: 1200.


Online Application


Also Read:


ఐఐఎస్సీలో బీఎస్సీ(రీసెర్చ్) ప్రవేశాలకు నోటిఫికేషన్
బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌(ఐఐఎస్సీ) నాలుగేళ్ల సైన్స్ రిసెర్చ్ డిగ్రీ (బీఎస్సీ-రిసెర్చ్) కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ పూర్తిచేసినవారు, ఈ ఏడాది ఇంటర్ సెకండియర్ పరీక్షలకు హాజరవుతున్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ విద్యాసంస్థలో నాలుగేళ్ల బీఎస్సీ రిసెర్చ్ కోర్సు పూర్తిచేసుకున్నవారు ప్రపంచస్థాయిలో పేరున్న సంస్థల్లో అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. ఐఐఎస్సీలోనే మరో ఏడాది చదువు పూర్తిచేసుకుని ఎమ్మెస్సీ డిగ్రీ పొందవచ్చు. ఆ తర్వాత పీహెచ్‌డీ దిశగా అడుగులు వేయవచ్చు.
దరఖాస్తు, కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..


సీయూఈటీ పీజీ రిజిస్ట్రేషన్ ప్రారంభం - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా!
దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (సీయూఈటీ-పీజీ-2023)‌ నోటిఫికేషన్ వెలువడింది. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 20న ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు డెబిట్/క్రెడిట్ కార్డులతో పాటు నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా దరఖాస్తు ఫీజును చెల్లించవచ్చు. పరీక్ష షెడ్యూలును త్వరలోనే వెల్లడించనున్నారు. సీయూటీ పీజీ ప్రవేశ పరీక్షను  జూన్ 1 నుండి జూన్ 10 వరకు నిర్వహించనున్నట్లు గతంలో UGC ఛైర్మన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
సీయూఈటీ పీజీ దరఖాస్తు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..