AP Inter Pass Percentage: ఏపీలో ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 12న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇంటర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సంబంధించి మొత్తం 10,02,150 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో ప్రథమ సంవత్సరం నుంచి 4,99,756 మంది హాజరుకాగా.. అందులో జనరల్ విద్యార్థులు 4,61,273 మంది; ఒకేషనల్ విద్యార్థులు 38,483 మంది ఉన్నారు. ఇక ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి మొత్తం 5,02,394 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. అందులో జనరల్ విద్యార్థులు 3,93,757  మంది; ఒకేషనల్ విద్యార్థులు 32,339 మంది; ప్రైవేటు విద్యార్థులు 76,298 మంది ఉన్నారు. 



ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్ ఫలితాల డైరెక్ట్ లింక్


ఇంటర్ రెండో సంవత్సర ఫలితాల డైరెక్ట్ లింక్


ప్రథమ సంవత్సరంలో ఉత్తీర్ణత ఇలా..
ఇంటర్ ఫలితాలకు సంబంధించి జనరల్ విభాగంలో ప్రథమ సంవత్సరం నుంచి 4,61,273 మంది పరీక్షలకు హాజరుకాగా.. వీరిలో 3,10,875 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 67 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇక ఒకేషనల్ విభాగంలో 38,483 మంది పరీక్షలకు హాజరుకాగా.. వీరిలో 23,181 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 60 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 



ద్వితీయ సంవత్సరంలో ఉత్తీర్ణత ఇలా..
ఇక ఇంటర్ ద్వితీయ సంవత్సరం జనరల్ ఫలితాలకు సంబంధించి 3,93,757 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. 3,06,528 మంది పరీక్షలో అర్హత సాధించారు. మొత్తం 78 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇక ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ ఫలితాలకు సంబంధించి 32,339 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. 23,000 మంది పరీక్షలో అర్హత సాధించారు. మొత్తం 80 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 


కొనసాగిన బాలికల హవా..
ఫలితాల్లో ఎప్పటిలాగే ఈసారి కూడా బాలికల హవా కొనసాగింది. ఇంటర్ జనరల్ విభాగంలో మొదటి సంవత్సరం 71 % బాలికలు అర్హత సాధించగా.. బాలురు 64 % మాత్రమే అర్హత సాధించారు. ఇక ఒకేషనల్ ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. మొదటి సంవత్సరంలో 47 శాతం బాలురు ఉత్తీర్ణులైతే, 70 శాతం బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ఇక సెకండియర్‌లో సంవత్సరంలో 59 శాతం బాలురు ఉత్తీర్ణులైతే, 80 శాతం బాలికలు ఉత్తీర్ణులయ్యారు.


జనరల్ విద్యార్థులకు సంబంధించి..


➥ ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలకు సంబంధించి జనరల్ విభాగానికి చెందిన బాలురు 2,26,240 పరీక్షలకు హాజరుకాగా.. 1,43,688 (64%) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక బాలికల విషయానికొస్తే.. 2,35,033 మంది పరీక్షలకు హాజరుకాగా.. 1,67,187 మంది ఉత్తీర్ణత సాధించారు.


➥ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలకు సంబంధించి జనరల్ విభాగానికి చెందిన బాలురు 1,88,849 పరీక్షలకు హాజరుకాగా.. 1,41,465 (75%) మంది  ఉత్తీర్ణులయ్యారు. ఇక బాలికల విషయానికొస్తే.. 2,04,908 మంది పరీక్షలకు హాజరుకాగా.. 1,65,063 మంది (81%) ఉత్తీర్ణత సాధించారు.


ఒకేషనల్ విద్యార్థులకు సంబంధించి..


➥ ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలకు సంబంధించి ఒకేషనల్ విభాగానికి చెందిన బాలురు 16,502 మంది పరీక్షలకు హాజరుకాగా.. 7,814 (47%) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక బాలికల విషయానికొస్తే.. 21,981 మంది పరీక్షలకు హాజరుకాగా.. 15,367 మంది ఉత్తీర్ణత సాధించారు.


➥ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలకు సంబంధించి ఒకేషనల్ విభాగానికి చెందిన బాలురు 13,764 మంది పరీక్షలకు హాజరుకాగా.. 8,160 (59%) మంది  ఉత్తీర్ణులయ్యారు. ఇక బాలికల విషయానికొస్తే.. 18,575 మంది పరీక్షలకు హాజరుకాగా.. 14,840 మంది (80%) ఉత్తీర్ణత సాధించారు.


ALSO READ:


ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా టాప్, తర్వాతి స్థానాల్లో నిలిచిన జిల్లాలివే


డిజిలాకర్‌లోనూ ఇంటర్ ఫలితాలు ఎందుకు పెట్టినట్టు?


ఏప్రిల్ 18 నుంచి ఇంటర్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌కు అవకాశం


ఇంటర్ ఫెయిల్ అయిన వారు బాధ పడొద్దు - సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పటి నుంచంటే?