GATE Exam 2026 Application: భారతదేశంలో నిర్వహించే కష్టతరమైన పరీక్షలలో గేట్ పరీక్ష ఒకటి. గేట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న చాలా మంది విద్యార్థులకు ఇది ఊరట కలిగించే విషయం. IIT గౌహతి గేట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీని అక్టోబర్ 9 నుండి అక్టోబర్ 13 వరకు పొడిగించింది. వాస్తవానికి, సాంకేతిక లోపాల కారణంగా లేదా చివరి నిమిషంలో వెబ్ సైట్‌లో సర్వర్ సమస్య కారణంగా చాలా మంది అభ్యర్థులు ఫారంను నింపలేకపోతున్నారు.
అలాంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఆలస్య రుసుము (Gate Late Fess)తో ఫారమ్‌ను పూరించడానికి అదనంగా 3 రోజులు సమయం ఇచ్చారు. దీనివల్ల గేట్ ఆస్పిరెంట్స్ తమ కలను సాకారం చేసుకోవడానికి మరో అవకాశం లభించింది. కనుక గేట్ పరీక్షకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో, లేట్ ఫీజు ఎంత ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం.
ఫారం నింపడానికి లేట్ ఫీజు ఎంత?
గేట్ 2026 అప్లికేషన్ ఫారమ్ ఫీజు విషయానికి వస్తే.. మొదట SC, ST, మహిళలా అభ్యర్థులు, దివ్యాంగ అభ్యర్థులకు ఒక్కో పేపర్‌కు రూ. 1000 చెల్లించాలి. ఇతర అభ్యర్థులకు రూ. 2000 ఉండేది. కాని చివరి తేదీ ముగిసిన తర్వాత మరో అవకాశం ఇచ్చారు. కనుక అక్టోబర్ 13 వరకు ఫారమ్ నింపే SC, ST, మహిళలు, దివ్యాంగ అభ్యర్థులు లేటు ఫీజుతో రూ. 1500 మరియు, ఇతర కేటగిరీల అభ్యర్థులు రూ. 2500 ఆలస్య రుసుము చెల్లించాలని తెలిపారు.
అప్లై చేయడానికి ఏ డాక్యుమెంట్లు అవసరం?
1. ఫోటో (పాస్‌పోర్ట్ సైజు)2. డిజిటల్ సంతకం3. వ్యాలిడ్ అయ్యే ఫోటో ID (ఆధార్, పాన్‌కార్డ్, పాస్‌పోర్ట్ మొదలైనవి)4. కేటగిరీ సర్టిఫికేట్ (SC/ST/OBC/PwD సర్టిఫికేట్)5. విద్యార్హతల సర్టిఫికేట్
ఎలా దరఖాస్తు చేయాలి?
1. మొదటగా మీరు అధికారిక వెబ్‌సైట్ gate2026.iitg.ac.in ని సందర్శించాలి.2. ఆ తర్వాత హోమ్ పేజీలో ఇచ్చిన GATE 2026 రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేయండి.3. మీ వివరాలను ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.4. తరువాత, అప్లికేషన్ ఫారంలో అడిగిన వివరాలను నింపి, అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.5. చివరగా కేటగిరీని బట్టి అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి సబ్మిట్ పై క్లిక్ చేయండి. మీ ఫారం సబ్మిట్ అవుతుంది. 6. ఆ తర్వాత మీ అప్లికేషన్ ఫారం సంబంధిత కాపీని కూడా డౌన్‌లోడ్ చేసుకోండి. భవిష్యత్ అవసరాలకు పనికొస్తుంది
ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పరీక్షలలో గేట్ ఎగ్జామ్ ఒకటి. దీని కోసం లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని పరీక్ష రాసిన క్వాలిఫై అయ్యేవారు చాలా తక్కువగా ఉంటారు. అయితే గేట్ లో మంచి స్కోరు వస్తే అది ఉద్యోగాలలో కూడా పనికొస్తుంది. మంచి గేట్ స్కోరు ఉన్న వారిని మాత్రమే కొన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తారు.