గేట్-2023 పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఏమైనా తప్పులు దొర్లితే, సరిచేసుకోవడానికి ఐఐటీ కాన్పూర్ అవకాశం కల్పించింది. నవంబరు 8 నుంచి 14 వరకు అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో ఏమైనా తప్పులుంటే సరిచేసుకోవచ్చు. దరఖాస్తు గడువు ముగిసేలోపు అభ్యర్థులు సవరణ చేసుకోవచ్చు. ఐఐటీ కాన్పూర్ జులై 27న 'గేట్-2023' నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 30 నుంచి అక్టోబరు 14 వరకు దరఖాస్తులు స్వీకరించింది. గేట్-2023 పరీక్షలను 2023లో ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో నిర్వహించనున్నారు. మొత్తం 29 సబ్జెక్టుల్లో గేట్ పరీక్ష నిర్వహిస్తారు.  మార్చి 16న ఫలితాలను వెల్లడించనున్నారు.  


గేట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 7 ఐఐటీలు (బొంబయి, ఢిల్లీ, గువాహటి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ)తోపాటు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్ ఆఫ్ సైన్స్, ఇతర ప్రభుత్వరంగ విద్యాసంస్థల్లో డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇతర ప్రైవేట్ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు కూడా గేట్ స్కోరునే ప్రవేశాలకు ప్రామాణికంగా తీసుకుంటాయి. కొన్ని ప్రభుత్వ సంస్థలు గేట్ స్కోరు ద్వారా ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తున్నాయి.


గేట్-2023 నోటిఫికేషన్, పరీక్ష పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


పరీక్ష ఎలా ఉంటుంది?


✦ మొత్తం 29 సబ్జెక్టుల్లో గేట్ పరీక్ష నిర్వహిస్తారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాలతోపాటు.. ఇతర దేశాలలోని నగరాల్లో కూడా గేట్ పరీక్ష నిర్వహిస్తారు.


✦ ప్రకటించిన తేదీల్లో మొత్తం రెండు సెషన్లలో గేట్ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.


✦ ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే గేట్ పరీక్షలో 100 మార్కులకు 65 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి 10 ప్రశ్నలకుగాను 15 మార్కులు; టెక్నికల్, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ విభాగాల నుంచి 55 ప్రశ్నలకుగాను 85 మార్కులు ఉంటాయి.


✦ నెగెటివ్ మార్కులు కూడా ఉన్నాయి. 1 మార్కు ప్రశ్నలకు ప్రతి తప్పు సమాధానానాకి 1/3 చొప్పున, 2 మార్కుల ప్రశ్నలకు ప్రతి తప్పు సమాధానానాకి 2/3 చొప్పున కోత విధిస్తారు.


దరఖాస్తుల్లో సవరణ ఇలా... 


1) మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి- gate.iitk.ac.in


2) గేట్-2023 అప్లికేషన్ కరెక్షన్ విండో పై క్లిక్ చేయాలి.


3) అభ్యర్థులు తమ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేయాలి. 


4) ఆ తర్వాత వచ్చే పేజీలో అభ్యర్థులు తమ దరఖాస్తుకు సంబంధించిన వివరాల్లో ఏమైనా తప్పులుంటే సరిచేసుకోవాలి.


5) దరఖాస్తు ఫీజు చెల్లించాలి.


6) ఆ తర్వాత అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని, భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.


GATE 2023 Website


ముఖ్యమైన తేదీలు...


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం                      :           30.08.2022.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది                                 :           30.09.2022. (07.10.2022 వరకు పొడిగింపు)


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది (ఎక్స్ టెండెడ్)        :          07.10.2022. (14.10.2022 వరకు పొడిగింపు)


దరఖాస్తుల సవరణ                                                   :           08.11.2022 - 14.11.2022 


అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్                                               :           03.01.2023.


అభ్యర్థుల రెస్పాన్స్-అప్లికేషన్ పోర్టల్                       :           15.02.2023.


ఆన్సర్ కీ అందుబాటులో                                          :           21.02.2023.


ఆన్సర్ కీ పై అభ్యంతరాల సమర్పణ                       :           22 - 25.02.2023.


గేట్ పరీక్ష తేదీలు 2020                                            :           ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో.


ఫలితాల వెల్లడి                                                        :           16.03.2023.


గేట్ స్కోర్ కార్డు డౌన్‌లోడ్                                         :           22.03.2023.


 


Also Read:


క్రాఫ్ట్స్ & డిజైనింగ్ కోర్సుల్లో ప్రవేశాలు, ఐఐసీడీ నోటిఫికేషన్ జారీ!!
ఇండియన్  ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్ (ఐఐసీడీ) 2023 విద్యాసంవత్సరానికి గాను వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా బీ.డిజైన్, ఎం.డిజైన్, ఎం.వొకేషన్ కోర్సుల్లో సీట్ల భర్తీ చేయనున్నారు. కోర్సుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. డిగ్రీ కోర్సులకు ఇంటర్ అర్హత ఉండాలి. పీజీ కోర్సులకు సంబంధి విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సరైన అర్హతలున్న అభ్యర్ధులు జనవరి 21లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


 


'ఫ్యాషన్' కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు ప్రారంభం- చివరితేది ఎప్పుడంటే?
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ప్రవేశాలకు నిర్దేశించిన 'NIFT-2023' రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబరు 1న ప్రారంభమైంది. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబరు 31 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.3000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1500 చెల్లిస్తే సరిపోతుంది. 
నోటిఫికేషన్, కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..