TS BC Study Circle: తెలంగాణ బీసీ స్టడీసర్కిల్ ఆధ్వర్యంలో మార్చి 11 నుంచి గ్రూప్-1 ఉచిత శిక్షణను ప్రారంభిస్తున్నట్లు బీసీ స్టడీసర్కిల్ డైరెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సైదాబాద్ కాలనీ లక్ష్మీనగర్‌లోని బీసీ స్టడీ సర్కిల్‌లో ఈ శిక్షణ కొనసాగుతుందన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 7న సాయంత్రం 5 గంటల్లోగా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు ప్రక్రియ మార్చి 4న ప్రారంభంకాగా.. మార్చి 7 వరకు నాలుగు రోజులపాటు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. అదేరోజు అభ్యర్థులకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ నిర్వహించి.. డిగ్రీలో మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు వివరించారు. విద్యార్థులు విద్యార్హతలకు సంబంధించిన అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు, ఇన్ కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్లలను తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం 040-24071178, 27077929 నంబర్లను సంప్రదించవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు మార్చి 11 నుంచి శిక్షణ ప్రారంభంకానుంది.

బీసీ స్టడీ సర్కిల్ నోటిఫికేషన్ ఇలా..

"Free Offline Coaching Programme for TSPSC GROUP-I (2024-25). The Physical (offline) Registration Start date:04/03/2024 to last date 7/03/2024, 5:00 pm. Certificate verification on the same day (Spot Admissions) at their concern District BC Study Circles (kindly bring original educational certificates, income, caste and one set of photocopy). Classes start from 11.03.2024.''

చిరునామా:
H.No.17-1-388/L/3, 
Laxminagar Colony, Road No.8, 
Saidabad, Hyderabad -500059.
Phone: LL No.: 040-24071178
E-mail Id: tsbcstudycirclehyd@gmail.com

ALSO READ:

Free Training: ఎస్సీ స్టడీ సర్కిళ్లలో ఉద్యోగ పరీక్షలకు ఉచిత శిక్షణకు 6 వరకు అవకాశం..
తెలంగాణ‌ ప్రభుత్వ ఎస్సీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న 12 ఎస్సీ స్టడీ సర్కిళ్లలో టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1, 2, 3, 4 ఉద్యోగ పరీక్షలతోపాటు.. బ్యాంకింగ్, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ ఉద్యోగ పరీక్షల కోసం 5 నెలల ఉచిత ఫౌండేషన్‌ కోర్సులో శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నారు. అర్హులైన తెలంగాణకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు ఉచిత శిక్షణకు అర్హులు. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 23న ప్రారంభంకాగా.. మార్చి 6 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. డిగ్రీ అర్హత ఉండి, కుటుంబ వార్షికాదాయం రూ.3 లక్షల్లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారికి ఉచిత స్టడీ మెటీరియల్‌ కూడా సమకూరుస్తారు. మరిన్ని వివరాల కోసం 040-23546552 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు ప్రతి జిల్లాశాఖకు 100 సీట్ల చొప్పున ఎంపిక చేస్తారు. ఇందులో ఎస్సీలకు 75%, ఎస్టీలకు 10%, బీసీ/ మైనారిటీలకు 15% సీట్లు కేటాయించారు. ఆదిలాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, కరీంనగర్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వరంగల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, రంగారెడ్డి. ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా శిక్షణకు అభ్యర్థులను ఎంపికచేస్తారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...