Free Coaching for Civil Services in BC Study Circle: హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్ ఎంప్లాయిబిలిటీ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ (TSBCESDTC) ఆధ్వర్యంలో టీఎస్ బీసీ స్టడీ సర్కిల్ సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్, మెయిన్స్) పరీక్షలకు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు కోరుతోంది. ప్రవేశ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిచేస్తారు. ఇందులో 100 మందిని ఆన్‌లైన్ రాతపరీక్ష ద్వారా ఎంపికచేస్తారు. మిగతా 50 సీట్లు సివిల్స్ ఫ్రిలిమ్స్ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు కేటాయిస్తారు. ఎంపికైనవారికి లాంగ్ టర్మ్ విధానంలో శిక్షణ ఇస్తారు. అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు జులై 3 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు స్టైపెండ్‌తోపాటు ఉచిత వసతి/ భోజన ఖర్చుల కింద రూ.5,000; బుక్‌ఫండ్ కింద రూ.5,000 ఇస్తారు. మరిన్ని వివరాలకు ఫోన్: 040- 24071178, టోల్ ఫ్రీ నెంబరు 18004250039 ద్వారా సంప్రదించవచ్చు.
వివరాలు..
* సివిల్స్ ఉచిత లాంగ్ టర్మ్ శిక్షణ (ప్రిలిమ్స్-కమ్-మెయిన్స్)
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి కుటుంబ సభ్యుల వార్షికాదాయం రూ.5 లక్షలకు మించకూడదు.
వయోపరిమితి: 32 సంవత్సరాలలోపు ఉండాలి.
సీట్లు: 150 (బీసీలకు 75%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 5%, ఇతరులకు 5% సీట్లను కేటాయించారు). ఇందులో 100 మందిని ఆన్‌లైన్ రాతపరీక్ష ద్వారా ఎంపికచేస్తారు. మిగతా 50 సీట్లు సివిల్స్ ఫ్రిలిమ్స్ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు కేటాయిస్తారు.
కోచింగ్ తేదీలు: 18.07.2024 నుంచి 18.04.2025 వరకు.
స్టడీ సర్కిల్ సెంటర్: Telangana BC Study Circle,
Laxminagar Colony, Saidabad, Hyderabad.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, రిజర్వేషన్ రూల్ ఆధారంగా.
స్టైపెండ్, ఇతర ఖర్చులు: శిక్షణ సమయంలో 75 శాతంపైగా హాజరు ఉన్నవారికి నెలకు రూ.5000 స్టైపెండ్ ఇస్తారు. ఇక ఉచిత శిక్షణతో పాటు వసతి/ భోజన ఖర్చుల కింద రూ.5,000; 60 శాతంపైగా హాజరు ఉన్నవారికి బుక్‌ఫండ్ కింద రూ.5,000 ఇస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 03.07.2024.
➥ ప్రవేశ పరీక్ష నిర్వహణ తేదీ: 07.07.2024.
➥ పరీక్ష ఫలితాల వెల్లడి: 10.07.2024.
➥ తరగతుల ప్రారంభం: 18.07.2024.
'గ్రూప్-2' ఉద్యోగార్థులకు ఉచితంగా గ్రాండ్ టెస్టులు..
తెలంగాణలో గ్రూప్-2 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత ఆన్‌లైన్ గ్రాండ్ టెస్టులు నిర్వహించనున్నారు. గ్రూప్-2 పరీక్షకు దరఖాస్తుల చేసుకున్న ఆసక్తి కలిగిన అభ్యర్థులు జులై 5 వరకు గ్రాండ్ టెస్ట్ కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థలుకు జులై నెలలో ప్రతివారంలో రెండు రోజులు గ్రాండ్ టెస్టులు నిర్వహించనున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జులై 8, 9 తేదీల్లో మొదటి గ్రాండ్ టెస్ట్; జులై 15, 16 తేదీల్లో రెండో గ్రాండ్ టెస్ట్; జులై 22, 23 తేదీల్లో మూడో గ్రాండ్ టెస్ట్; జులై 30, 31 తేదీల్లో నాలుగో గ్రాండ్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
గ్రూప్-2 గ్రాండ్ టెస్ట్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..