గుంటూరులోని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో 2023-24 విద్యాసంవత్సరానికి వివిధ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి అక్టోబర్ 11న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈమేరకు వర్సిటీ రిజిస్ట్రార్ జి.రామారావు అక్టోబరు 6న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం, విత్తన సాంకేతిక పరిజ్ఞానం కోర్సుల్లో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేయనున్నారు. గుంటూరులోని లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం లాంఫాం పాలిటెక్నిక్ విభాగంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
కౌన్సెలింగ్ వేదిక: ఏపీజీసీ సెమినార్ హాల్, పాలిటెక్నిక్ సెక్షణ, లాం, గుంటూరు.
సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలు..
ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆన్‌లైన్‌లో నిర్వహించే 2 నెలల వ్యవధి వ్యవసాయ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ జి.రామారావు తెలిపారు. ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు రూ.1500 చొప్పున ఫీజు చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
ALSO READ:
అగ్రిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, 99.5 శాతం ఉత్తీర్ణులు
అగ్రిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, 99.5 శాతం ఉత్తీర్ణులుఆంధ్రప్రదేశ్‌లో అడ్రికల్చర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సెప్టెంబరు 1న నిర్వహించిన 'అగ్రిసెట్-2023' ప్రవేశ పరీక్ష ఫలితాలు అక్టోబరు 6న విడుదలయ్యాయి. వర్సిటీ పరిపాలన భవన్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వర్సిటీ ఉపకులపతి శారద జయలక్ష్మీదేవి, అగ్రిసెట్ కన్వీనర్ సుధాకర్ ఫలితాలను విడుదల చేశారు. ఏపీ, తెలంగాణల నుంచి మొత్తం 2006 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా.. 1994 (99.5శాతం)మంది ఉత్తీర్ణులయ్యారు. అక్టోబర్ 7 నుంచి విద్యార్థుల మార్కుల జాబితాను వర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. త్వరలోనే కౌన్సెలింగ్ తేదీలను వెల్లడించనున్నట్లు రిజిస్ట్రార్ రామారావు వెల్లడించారు.
ఫలితాల వివరాల కోసం క్లిక్ చేయండి..
జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్ టైమ్ పీజీ కోర్సులు, అర్హతలివే!
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూహెచ్)-పార్ట్ టైమ్ పీజీ కోర్సుల్లో దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. సెప్టెంబరు 27తో ముగిసిన గడువును అక్టోబరు 9 వరకు పొడిగించారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.3000 చెల్లించాల్సి ఉంటుంది. ఎంటెక్, ఎంబీఏ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో ప్రోగ్రామ్ వ్యవధి మూడేళ్లు. ఆరు సెమిస్టర్లు ఉంటాయి. వీటిని ఉద్యోగులకు ప్రత్యేకించారు. అభ్యర్థులు హైదరాబాద్ పరిధిలో కనీసం ఏడాదిపాటు ఉద్యోగం చేసిన అనుభవం తప్పనిసరిగా ఉండాలి. దరఖాస్తుతోపాటు ఒరిజినల్ సర్వీస్ సర్టిఫికెట్ అవసరమవుతాయి. ప్రవేశపరీక్ష ద్వారా సీట్లను భర్తీ చేస్తారు. అయితే ఈ ప్రోగ్రామ్‌లకు ఎలాంటి స్కాలర్‌షిప్ లభించదు.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..
అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు మరోసారి పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీ.జీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో ప్రవేశాల గడువును అధికారులు మరోసారి పొడిగించారు. అక్టోబరు 4తో గడువు ముగియగా.. ప్రవేశాలు పొందేందుకు అక్టోబరు 20 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అభ్యర్థులు అక్టోబరు 20 వరకు ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరంలేదు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..