ఏపీలోని జూనియర్ కళాశాలల్లో స్థూల ప్రవేశాల నిష్పత్తి కోసం ఫెయిల్‌ అయిన ప్రైవేటు అభ్యర్థులు సైతం రెగ్యులర్‌గా చదివేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇంటర్ పరీక్షలో ఫెయిలైన విద్యార్థులను తిరిగి కాలేజీల్లో చేర్చుకుని రీఅడ్మిషన్ కల్పించే ప్రక్రియ ఇంటర్‌లోనూ చేపట్టారు. పదోతరగతిలో రీఅడ్మిషన్ విధానం ఈ ఏడాది కొత్తగా ప్రారంభించారు. ఇంటర్‌లోనూ రీఅడ్మిషన్ పొందవచ్చని, అలా చేరిన విద్యార్థులు ఫెయిల్ అయినవాటితోపాటు అన్ని సబ్జెక్టులు తిరిగి రాయాల్సి ఉంటుందని ఇంటర్ విద్యామండలి కార్యదర్శి సౌరభ్ గౌర్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే పాసైన సబ్జెక్టుల్లో రెండు పరీక్షల్లో ఎక్కువగా వచ్చిన మార్కులను పరిగణనలోకీ తీసుకుంటామన్నారు. రీఅడ్మిషన్ పొంది ఉత్తీర్ణులైన విద్యార్థులకు రెగ్యులర్ విద్యార్థుల తరహాలోనే సర్టిపికేట్లు  జారీచేస్తామని పేర్కొన్నారు. ఫెయిల్ అయిన, ప్రైవేటు విద్యార్థులు నవంబరు 30లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని సౌరభ్‌గౌర్ ప్రకటించారు.


డిజీ లాకర్‌లో ఇంటర్ సర్టిఫికేట్లు..
ఇంటర్మీడియట్ విద్యార్థులు సర్టిఫికేట్లు డిజీ లాకర్‌లో అందుబాటులో ఉంచినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరభ్‌గౌర్ తెలిపారు. 2014 నుంచి 2023 వరకు ఉత్తీర్ణులైన విద్యార్థుల సర్టిఫికెట్లు డిగీలాకర్‌లో ఉంటాయని పేర్కొన్నారు. అలాగే మైగ్రేషన్ సర్టిఫికేట్లు, తత్సమాన సర్టిఫికేట్లు, అర్హత పత్రాలు కూడా అందుబాటులో ఉంటాయని, విద్యార్థులు, కాలేజీల యాజమాన్యాలు ఈ అవకాశం ఉపయోగించుకోవాలని సూచించారు.


'హాజరు' మినహాయింపు ఫీజుకు నవంబరు 30 వరకు అవకాశం
వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించే ఇంటర్మీడియట్‌ పరీక్షలకు హాజరయ్యే ప్రైవేటు విద్యార్థులకు హాజరు మినహాయింపునిస్తూ ఇంటర్‌ విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. దీనికోసం నవంబరు 30 లోపు రూ.1,500 ఫీజు చెల్లించాలని సూచించింది. అపరాధ రుసుము రూ.500తో డిసెంబరు 31వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది.


ఇంటర్‌ విద్యార్థులకు స్టడీ అవర్స్..
ఏపీలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సాయంత్రం స్టడీ అవర్‌ నిర్వహించాలని ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి సౌరబ్‌ గౌర్‌ ఆదేశాలు జారీ చేశారు. ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు విద్యార్థులను చదివించాలని, ఆ సమయంలో విద్యార్థుల హాజరు నమోదు చేసి జిల్లా వృత్తివిద్యాధికారులకు పంపించాలని సూచించారు. సోమవారం నుంచి శనివారం వరకు ఏ రోజు ఏ సబ్జెక్టు చదివించాలనే వివరాలు సైతం తెలిపారు.


వారం రోజుల దసరా సెలవులు..
ఏపీలోని ఇంటర్ కాలేజీలకు అక్టోబర్ 19 నుంచి 25 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలకు ఈ సెలవులు వర్తించనున్నాయి. సెలవురోజుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఇంటర్ బోర్డు హెచ్చరించింది.


ALSO READ:


TSBIE: ఇంటర్‌ ప్రవేశాల గడువు పొడిగింపు, ఇక ఇదే చివరి అవకాశం!
తెలంగాణలోని అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు. ప్రవేశాలు పొందడానికి అక్టోబ‌రు 9 వరకు అవకాశం కల్పించినట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ అక్టబరు 3న  ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్‌ కాలేజీల్లో ప్రవేశాలకు విద్యార్థులు రూ.1000 ఆలస్యరుసుము చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ కళాశాలల్లో ఎలాంటి రుసుము లేకుండా ప్రవేశాలు పొందవచ్చు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సు, సీట్ల వివరాలు ఇలా!
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ) 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌(బీడిజైన్‌) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌, అహ్మదాబాద్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌, అసోంలో ఉన్న ఎన్‌ఐడీ క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 1లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...