బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సులకు సంబంధించి ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ఇంజినీరింగ్ఉమ్మడి ప్రవేశపరీక్ష (ఏపీఈసెట్-2023) వాయిదా పడింది. మే 5న నిర్వహించవలసిన ఈ పరీక్షను జూన్20కు వాయిదా వేసినట్లు ఏపీ ఈసెట్ ఛైర్మన్, జేఎన్‌టీయూకే ఉపకులపతి ఆచార్య జీవీఆర్ ప్రసాదరాజు వెల్లడించారు. పాలిటెక్నిక్ ఆఖరి సంవత్సరం పరీక్షలు పూర్తికాకపోవడంతో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ బోర్డు అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పూర్తివివరాలను వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని, సందేహాలకు 85004 04562 నంబరులో సంప్రదించాలని కన్వీనర్ ఆచార్య ఎ.కృష్ణమోహన్ తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
వివరాలు..
* ఏపీఈసెట్ - 2023
కోర్సులు: బీటెక్, బీఫార్మసీ.
అర్హత: పాలిటెక్నిక్ డిప్లొమా (ఇంజినీరింగ్), బీఎస్సీ (మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తుకు అర్హులు.
దరఖాస్తు ఫీజు: రిజిస్ట్రేషన్ ఫీజుగా ఓసీ అభ్యర్థులు రూ.600; బీసీ అభ్యర్థులు రూ.550; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రవేశపరీక్షలో ర్యాంకు ఆధారంగా.
పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకుగాను ఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 200 ఆబ్జె్క్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నల తీరు ఇంజినీరింగ్, ఫార్మసీ, బీఎస్సీ (మ్యాథ్స్) విభాగాలకు వేర్వేరుగా ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు...
➥ పరీక్ష తేది: 20.06.2023.
➥ పరీక్ష సమయం: ఉ.9 గం.- మ. 12 గం. వరకు, మ.3 గం.-సా.6 గం. వరకు.
Also Read:
డీఈఈసెట్-2023 నోటిఫికేషన్ విడుదల, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ!
తెలంగాణలో ప్రాథమిక ఉపాధ్యాయ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే 'డీఈఈసెట్-2023' (డీఎడ్) నోటిఫికేషన్ ఏప్రిల్ 21న విడుదలైంది. రెండేళ్ల కాలపరిమతితో ఉండే డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 22న ప్రారంభమైంది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు రూ.500 దరఖాస్తు ఫీజు చెల్లించి ఏప్రిల్ 22 నుంచి మే 22 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి.
ప్రవేశ ప్రకటన, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
ఫైన్ ఆర్ట్స్, డిజైన్ కోర్సుల్లో ప్రవేశాలకు 'ఏడీసెట్-2023' నోటిఫికేషన్ వెల్లడి, వివరాలు ఇలా!
కడపలోని డాక్టర్ వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ & ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వివిధ ఫైన్ ఆర్ట్స్, డిజైన్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఈ మేరకు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి 'ఆర్ట్ & డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏడీసెట్)-2023' నోటిఫికేషన్‌ను ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష ద్వారా డాక్టర్ వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్(బీఎఫ్‌ఏ), బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (బీడిజైన్ ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏప్రిల్ 21న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాాగా.. మే 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
టెక్నికల్ టీచర్స్ కోర్సుకు దరఖాస్తులు స్వీకరణ, చివరితేది ఎప్పుడంటే?
టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ 42 రోజుల సమ్మర్ ట్రైనింగ్ కోర్సుకు (టీసీసీ) దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. హైదరాబాద్, హన్మకొండ, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో కోర్సుకు సంబంధించిన శిక్షణను ఇవ్వనున్నట్లు తెలిపారు.ఆయా జిల్లా డీఈఓలను సంప్రదించి దరఖాస్తు ప్రక్రియ గురించి వివరాలు తెలుసుకోవచ్చు. మే 1 నుంచి జూన్ 11 వరకు కోర్సు శిక్షణ ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు ఏప్రిల్ 21 నుంచి 30 వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్ల పేర్కొన్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..