AP EAPCET Result 2021 Live Updates: నేడే ఈఏపీసెట్ అగ్రి, ఫార్మసీ విభాగాల విడుదల .. ఫలితాల లైవ్ అప్‌డేట్స్ మీకోసం..

ఆంధ్రప్రదేశ్‌లో ఈఏపీసెట్‌ అగ్రి, ఫార్మసీ విభాగాల ఫలితాలు మరికొద్ది గంటల్లో విడుదల కానున్నాయి. ఫలితాల లైవ్‌ అప్‌డేట్లను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. తాజా అప్‌డేట్ల కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 14 Sep 2021 07:40 AM
మరో 15 నిమిషాల్లో ప్రెస్ మీట్..

ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఫలితాల విడుదలకు సంబంధించిన ప్రెస్ మీట్ మరో 15 నిమిషాల్లో మొదలు కానుంది. 

ఈసారి ఇంట‌ర్ వెయిటేజీ లేకుండానే..

ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు ఇంటర్ మార్కుల వెయిటేజ్‌ తొల‌గించిన‌ట్లు ఏపీ ఇంట‌ర్ బోర్డు ప్ర‌క‌టించింది. గ‌తేడాది వ‌ర‌కు ఈ ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల‌లో విద్యార్థులకు వారి ఇంట‌ర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చేవారు. ఈ ఏడాది కోవిడ్ కారణంగా ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌లేదు. ఈ నేపథ్యంలో వెయిటేజ్ తొలిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. 

ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోండిలా..

  • ఈఏపీసెట్ ఫలితాల కోసం sche.ap.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి. 

  • అక్కడ ఈఏపీసెట్ 2021 రిజల్ట్స్ లింక్ మీద క్లిక్ చేయండి. 

  • రిజిస్ట్రేషన్ నంబర్, ఈఏపీసెట్ హాల్ టికెట్ నంబర్ వివరాలు ఎంటర్ చేయండి. 

  • వ్యూ రిజల్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే.. ఫలితాలు మీ స్క్రీన్ మీద కనిపిస్తాయి.

  • భవిష్యత్ అవసరాల కోసం వీటిని డౌన్‌లోడ్ చేసుకోండి.   

Background

ఆంధ్రప్రదేశ్‌లో ఈఏపీసెట్‌ (ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)- 2021 అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ఫలితాలు నేడు (సెప్టెంబర్ 14) విడుదల కానున్నాయి. ఇవాళ ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. మంగళగిరిలోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ పరీక్షలకు మొత్తం 83,822 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 78,066 మంది పరీక్షలు రాశారు. ఈఏపీసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల పరీక్షలు ఈ నెల 7వ తేదీతో ముగిశాయి. కంప్యూటర్‌ ఆధారిత విధానం ద్వారా మొత్తం 5 విడతలుగా ఈ పరీక్షలను నిర్వహించారు. అభ్యర్థులు తమ ఫలితాల కోసం sche.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. జేఎన్టీయూ కాకినాడ (JNTUK) ఈఏపీసెట్ పరీక్షలను నిర్వహణ బాధ్యతలను చూస్తోంది. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.