తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో రాష్ట్రంలోని పాఠశాలలకు అక్టోబరు 13 నుంచి 25 వరకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబరు 13 నుంచి సెలవులు ప్రారంభమయ్యాయి. ఈ సారి మొత్తం 13 రోజులపాటు ప్రభుత్వ, ప్రైవేట్‌ బడులకు సెలవులు ఉండున్నాయి. తిరిగి అక్టోబరు 26న స్కూల్స్ తెరచుకోనున్నాయి. రాష్ట్రంలోని అన్ని రకాల స్కూళ్లు ఈ సెలవులను పాటించాలని సూచించింది. అక్టోబరు 22న సద్దుల బతుకమ్మతో బతుకమ్మ పండగ ముగియనుంది. ఈ ఏడాది అక్టోబరు 23న దసరా పండగ జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అక్టోబరు 24న కూడా ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించింది.


జూనియర్ కాలేజీలకు 19 నుంచి 25 వరకు..
రాష్ట్రంలోని ఇంటర్మీడియట్‌ కాలేజీలకు మాత్రం 7 రోజులపాటు సెలవులు ఇవ్వనున్నారు. అక్టోబరు 19 నుంచి 25 వరకు సెలవులివ్వాలని విద్యాశాఖ పేర్కొంది. అక్టోబరు 26న కాలేజీలు తిరిగి ప్రారంభంకానున్నాయి. సెలవురోజుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయిన ఇంటర్ బోర్డు హెచ్చరించిన సంగతి తెలిసిందే.


డిగ్రీ, పీజీ కాలేజీలకు దసరా సెలవులు ఖరారు..
తెలంగాణలో బతుకమ్మ, దసరా పండగల నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ 11 రోజులపాటు సెలవులు ప్రకటించింది. యూనివర్సిటీలో చదివే విద్యార్థులకు అక్టోబర్ 14 నుంచి 24 వరకు సెలవులు ఇవ్వనున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ వెల్లడించింది. ఓయూ క్యాంపస్‌తోపాటు.. యూనివర్సిటీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీలకు అక్టోబర్ 14 నుంచి 24 వరకుసెలవులు ఉంటాయని ప్రకటించింది. కాలేజీలన్నీ తిరిగి అక్టోబర్ 25న ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.


ALSO READ:


'ఆయుష్‌' పీజీ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్, 17 వరకు దరఖాస్తుకు అవకాశం
తెలంగాణలో ఆయుష్‌ పీజీ వైద్య సీట్ల భర్తీకి కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం అక్టోబరు 10న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏఐఏపీజీఈటీ-2023 పరీక్షలో అర్హత సాధించిన వారు దరఖాస్తుకు అర్హులు. పీజీ ఆయుర్వేదం, హోమియో, యునానీ కోర్సుల్లో కన్వీనర్‌ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్‌లో అక్టోబరు 11న ఉదయం 9 గంటల నుంచి అక్టోబరు 17న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 
నోటిఫికేషన్, ప్రవేశ వివరాల కోసం క్లిక్ చేయండి..


బీపీటీ, బీఎస్సీ పారామెడికల్ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల
ఏపీలో 2023-24 విద్యాసంవత్సరానికి బీపీటీ, బీఎస్సీ పారా మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి డా.వైఎస్సార్‌ హెల్త్ యూనివర్సిటీ అక్టోబరు 8న నోటిఫికేషన్ విడుదల చేసింది. బీపీటీతో పాటు వివిధ బీఎస్సీ పారామెడికల్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కాంపిటెంట్‌ అథారిటీ కోటా సీట్ల భర్తీకి అక్టోబర్‌ 8 నుంచి 19 వరకు అర్హులైన ఇంటర్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


అజీమ్ ప్రేమ్‌జీ వర్సిటీలో డిగ్రీ కోర్సులు, వివరాలు ఇలా!
అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ బెంగళూరు, భోపాల్‌లోని క్యాంపస్‌లలో 2023-24 విద్యా సంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు నవంబరు 22లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా సీటు కేటాయిస్తారు. 
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...