AP HORTICET-2024 Notification: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హార్టికల్చరల్‌ యూనివర్సిటీ, 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎస్సీ(ఆనర్స్) కోర్సులో ప్రవేశానికి 'ఏపీ హార్టిసెట్‌-2024' నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. హార్టిసెట్‌ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం 101 సీట్లను భర్తీ చేస్తారు. వీటిలో యూనివర్సిటీ కాలేజీ సీట్లు 61 కాగా.. ప్రైవేట్ కాలేజీ సీట్లు 40 ఉన్నాయి. మొత్తం సీట్లులో లోకల్ అభ్యర్థులకు 85 శాతం సీట్లు, 15 శాతం సీట్లు అన్-రిజర్వ్‌డ్ కింద భర్తీ చేస్తారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మే 22న ప్రారంభంకాగా.. జూన్ 15న సాయంత్రం 4 గంటల్లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 


అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి సంబంధిత చిరునామాకు నిర్ణీత గడువులోగా చేరేలా పంపాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. దరఖాస్తు చేసుకున్నవారికి జులై 26న ఏపీ హార్టిసెట్‌ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు.


వివరాలు..


* ఏపీ హార్టిసెట్‌ (AP HORTICET) - 2024 నోటిఫికేషన్ 


బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్ డిగ్రీ ప్రోగ్రాం


కోర్సు వ్యవధి: 4 సంవత్సరాలు.


సీట్ల సంఖ్య: 101


సీట్ల కేటాయింపు: బీసీలకు 29 %, ఎస్సీలకు 15 %, ఎస్టీలకు 6 %, స్పెషల్ కేటగిరీలకు 9 %, మహిళలకు 33.33 %, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 10 % సీట్లను కేటాయించారు.


అర్హత: డిప్లొమా ఇన్ హార్టికల్చర్ కోర్సు ఉత్తీర్ణత.


వయోపరిమితి: 31.12.2024 నాటికి 17 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 25 సంవత్సరాలు, దివ్యాంగులు 27 సంవత్సరాలకు మించకూడదు.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి, నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి


దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది.  “COMPTROLLER, Dr.YSRHU, TADEPALLIGUDEM” పేరిట నిర్ణీత మొత్తంతో డిడి తీయాలి. ఖాతాదారుడి పేరు: COMPTROLLER, Dr.YSRHU, అకౌంట్ నెంబర్: 055011011002545, FSC/RTGS కోడ్: UBIN0805505, బ్రాంచ్ పేరు: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తాడేపల్లి గూడెం.


ఎంపిక విధానం: ఏపీ హార్టిసెట్‌-2024 ద్వారా.


పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో 200 బహుళైచ్చిక ప్రశ్నలుంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. 


అర్హత మార్కులు: హార్టిసెట్-2024 ప్రవేశ పరీక్షలో కనీస అర్హత మార్కుల శాతాన్ని 25% గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి కనీస అర్హత మార్కులు లేవు.


పరీక్ష కేంద్రాలు: కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ - పార్వతీపురం, కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ - వెంకటరామన్నగూడెం(తాడేపల్లిగూడెం), కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ - చినాలతరిపి-నెల్లూరు, కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్-అనంతరాజుపేట. 


దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Registrar, 
Dr.Y.S.R Horticultural University, 
Venkataramannagudem-534101, 
West Godavari District, Andhra Pradesh. 


ముఖ్యమైన తేదీలు..


➥ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.05.2024.


➥ దరఖాస్తుకు చివరి తేది: 15.06.2024. (4 P.M.)


➥ పరీక్ష తేది: 26.07.2024.


పరీక్ష సమయం: 10.00 AM – 12.00 PM.


Notifiation & Application


Website


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..