తెలంగాణలో ఎంటెక్‌, ఎం ఫార్మసీ, అర్కిటెక్చర్‌ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీజీఈసెట్‌) ఫలితాలను సెప్టెంబర్ 3న విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 3న సాయంత్రం 4 గంటలకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఫ‌లితాల‌ను చైర్మన్‌ లింబాద్రి విడుదల చేశారు. పీజీఈసెట్ పరీక్షకు సంబంధించిన ర్యాంకు కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పీజీఈసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి తమ ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ పీజీఈసెట్ రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ర్యాంకు కార్డులు పొందవచ్చు.  

పీజీఈసెట్ ర్యాంకు కార్డుల కోసం క్లిక్ చేయండి.. 

91.48 శాతం ఉత్తీర్ణత..
టీఎస్ పీజీఈసెట్‌ను ఆగ‌స్టు 2-5 తేదీల్లో రెండు సెష‌న్లలో నిర్వహించారు. మొత్తం 12 కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో ఉస్మానియా యూనివ‌ర్సిటీ ఈ ప‌రీక్షల‌ను నిర్వహించింది. పీజీఈసెట్-2022 పరీక్షలో మొత్తం 91.48 శాతం మంది అర్హత సాధించారు. 19 విభాగాల్లో జరిగిన పరీక్షలకు మొత్తం 12,592 మంది హాజరుకాగా.. వారిలో 11,520 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణులైనవారిలో 6,440 మంది (55.90 శాతం) అమ్మాయిలు, 5,080 మంది అబ్బాయిలు ఉన్నారు. ఒక్క ఫార్మసీ విభాగంలోనే 5,186 మంది పాస్ అవడం విశేషం. మిగిలిన 6,334 మంది ఇతర 18 విభాగాల్లో ఉన్నారని పేర్కొన్నారు. ఏడు విభాగాల్లో అమ్మాయిలు టాపర్లుగా నిలిచారు.


Also Read: భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఒక్కరోజులోనే వీసా!


సీట్ల కేటాయింపులో వీరికే ప్రాధాన్యం..
తొలుత గేట్ , జీప్యాట్ ర్యాంకర్లకు సీట్లు కేటాయించున్నారు. వారిలో ఇప్పటివరకు 427 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబరు 7 వరకు గడువు ఉంది.

PGECET 2022 Ranck Card ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

1) అభ్యర్థులు మొదటగా pgecet.tsche.ac.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
2) “Download rank card” లింక్ పై క్లిక్ చేయండి.
3) పీజీఈసెట్ రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు వివరాలను ఎంటర్ చేయాలి
4) సబ్ మిట్ చేసిన తర్వాత ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
5) డౌన్‌లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి ర్యాంక్ కార్డు పొందవచ్చు
6) కౌన్సెలింగ్ లో ర్యాంక్ కార్డు తప్పనిసరి.


 


Also Read: APRCET-2022: ఏపీఆర్‌సెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, వివరాలు ఇలా!


 


TS ECET Counsellinhg Schedue: ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
తెలంగాణ ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు వెలువడింది. ఈసెట్‌ ద్వారా పాలిటెక్నిక్‌ డిప్లొమో పూర్తిచేసిన విద్యార్థులు ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరంలో ప్రవేశాల కోసం సెప్టెంబరు 7న కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది.

ముఖ్య తేదీలు:

* సెప్టెంబరు 7 నుంచి 9 వరకు ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్ రుసుము చెల్లించి ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి.
* సెప్టెంబరు 9 నుంచి 12 వరకు ధ్రువపత్రాల పరిశీలన
* సెప్టెంబరు 9 నుంచి 14 వరకు వెబ్‌ ఆప్షన్లు ఉంటాయి.
* సెప్టెంబరు 17న మొదటి విడత ఈసెట్‌ సీట్లను కేటాయిస్తారు.
* మొదటి విడతలో సీటు పొందిన అభ్యర్థులు సెప్టెంబరు 17 నుంచి 22 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్‌ ప్రక్రియను పూర్తి చేయాలి.

తుది విడత కౌన్సెలింగ్ ఇలా...
* మిగిలిన సీట్ల కోసం సెప్టెంబరు 25 నుంచి తుది విడత కౌన్సెలింగ్‌ ఉంటుంది.
* సెప్టెంబర్‌ 25న స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాలి
* సెప్టెంబర్ 26న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది.
* సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ నిర్వహిస్తారు.
* సెప్టెంబరు 29న తుది విడత సీట్లను కేటాయిస్తారు.
* సీట్లు దక్కించుకున్న విద్యార్థులు సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 10లోగా ఆయా కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది.
వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మిగిలిన సీట్ల కోసం సెప్టెంబర్ 30న స్పాట్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..