DOST New Schedule: తెలంగాణలోని  ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్దేశించిన దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ-DOST) మొదటి దశ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 6న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే మే 25తో ముగియాల్సిన దరఖాస్తు గడువును మే 29 వరకు అధికారులు పొడిగించారు. ఇక మే 15 నుంచి ప్రారంభం కావాల్సిన వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియ మే 20 నుంచి ప్రారంభంకానుంది. విద్యార్థులు మే 30 వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు. స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు మే 28, 29 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన చేపడతారు.


దోస్త్ మొదటి దశలో వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి జూన్ 6న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 7 నుంచి 12 మధ్య సంబంధిత కళాశాలలో సెల్ప్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు మొదటి విడతలో రూ.200 చెల్లించాలి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది.  ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం 'దోస్త్‌' ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


దోస్త్‌ పరిధిలో రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలో 1054 డిగ్రీ కాలేజీలుండగా, వాటిలో 136 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, నాన్‌ దోస్త్‌ కాలేజీలు 63 ఉన్నాయి. మిగిలినవి ప్రైవేట్‌ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 3,86,544 డిగ్రీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ తదితర కోర్సుల్లోని సీట్లను దోస్త్‌ ద్వారా భర్తీచేస్తారు. 


మొదటి దశ షెడ్యూలు.. 


➥ ఫేజ్-1 రిజిస్ట్రేషన్ ప్రక్రియ: 06.05.2024 - 29.05.2024 (రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200)


➥ ఫేజ్-1 వెబ్‌ఆప్షన్లు: 20.05.2024 - 30.05.2024


➥ ఫేజ్-1 స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్: 


(i) PH/ CAP - 28.05.2024


(ii) NCC - 29.05.2024


➥ ఫేజ్-1 సీట్ల కేటాయింపు: 06.06.2024


➥ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: 07.06.2024 - 12.06.2024.


'దోస్త్' రెండో దశ ప్రవేశాలు ఇలా..


➥  రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జూన్ 6 నుంచి 13 వరకు కొనసాగనుంది. (రిజిస్ట్రేషన్ ఫీజు రూ.400)


➥  రెండో విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు జూన్ 6 నుంచి 14 వరకు అవకాశం కల్పించనున్నారు.


➥ ఫేజ్-2 స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ (PH/ CAP/NCC ): 13.06.2024.


➥  విద్యార్థులకు జూన్ 18న రెండో విడత డిగ్రీ సీట్లను కేటాయిస్తారు.


➥  సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 19 నుంచి 24 మధ్య సంబంధిత కళాశాలలో సెల్ప్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.


'దోస్త్' మూడో విడత ప్రవేశాలు ఇలా..


➥ ఇక చివరగా.. జూన్ 19 నుంచి మూడో విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది.


➥ విద్యార్థులు జూన్ 25 వరకు దరఖాస్తులు సమర్పించాలి.


➥  చివరి విడత వెబ్ ఆప్షన్ల ప్రక్రియను జూన్ 19 నుంచి 25 వరకు నిర్వహించనున్నారు.


➥ విద్యార్థులకు జూన్ 29న మూడో విడత డిగ్రీ సీట్లను కేటాయిస్తారు.


➥ సీట్లు పొందిన విద్యార్థులు జులై 3లోగా సంబంధిత కళాశాలలో సెల్ప్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.


➥ కళాశాలలో విద్యార్థులకు ఓరియంటేషన్ తరగతులు: 01.07.2024 - 06.07.2024.


➥  జులై 8 నుంచి కళాశాలల్లో తరగతులు ప్రారంభంకానున్నాయి.


Notification (Telugu)


Notification (English)


Online Registration


DOST Schedule


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..