తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి జనరల్ నర్సింగ్ అండ్‌ మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం) ట్రైనింగ్ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా రాష్ట్రంలోని 6 ప్రభుత్వ, 162 ప్రైవేటు నర్సింగ్‌ కళాశాలల్లో జీఎన్ఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్‌ ఉత్తీర్ణులైన పురుష, మహిళా అభ్యర్థులు సెప్టెంబర్‌ 16లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్‌ మార్కులు, రిజర్వేషన్ల ప్రకారం సీటు కేటాయిస్తారు.


వివరాలు..


* జనరల్ నర్సింగ్ అండ్‌ మిడ్‌వైఫరీ కోర్సు


వ్యవధి: మూడేళ్లు.


అర్హత: 40 శాతం మార్కులతో ఇంటర్ (లేదా) ఇంటర్‌ ఒకేషనల్ (ఏఎన్‌ఎం/ హెల్త్‌ కేర్‌ సైన్స్‌) ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 31.12.2023 నాటికి 17 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ఇంటర్‌ మార్కులు, రిజర్వేషన్ల ప్రకారం సీటు కేటాయిస్తారు.


రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.300.


ముఖ్య తేదీలు...


➥ ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 16.09.2023.


➥ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 19.09.2023. 


➥  తరగతులు ప్రారంభం: 15.10.2023.


Online Application


Website


                                       


ALSO READ:


ఫ్రాన్స్‌లో చదవాలనుకునే వాళ్లకు గుడ్ న్యూస్ - 30 వేల మంది విద్యార్థులకు ఆహ్వానం
భారతదేశం నుంచి అనేక మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రతీ ఏటా వేలాది మంది విద్యార్థులు అనేక దేశాలకు వెళ్తుంటారు. అమెరికా, జపాన్, ఫ్రాన్స్, చైనా, ఆస్ట్రేలియా.. ఇలా ఆయా దేశాలకు వెళ్తుంటారు. అయితే ఈ ఏడాది ఫ్రాన్స్‌కు వెళ్లి చదవాలి అనుకునే విద్యార్థులకు ఆ దేశ సర్కారు శుభవార్త చెప్పింది. 2030 నాటికి మన దేశం నుంచి దాదాపు 30 వేల మంది విద్యార్థులను తమ దేశానికి ఆహ్వానించేందుకు సిద్ధమని ప్రకటించింది. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌లో పర్యటించగా.. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం పెంపొందించుకునే దిశగా అనేక చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ 30 వేల మంది భారతీయ విద్యార్థులను తమ దేశానికి ఆహ్వానించేందుకు సిద్ధమయ్యారు. అయితే అధ్యక్షుడి ఆదేశాలతో ఆ దేశ రాయబార కార్యాలయం కార్యాచరణ కూడా ప్రారంభించింది. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


సెప్టెంబరు 8 నుంచి ఏపీ ఐసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం, షెడ్యూలు ఇలా!
ఆంధ్రప్రదేశ్‌లో ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్దేశించిన ఏపీ ఐసెట్‌-2023 వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబరు 8 నుంచి ప్రారంభంకానుంది. ఐసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 8 నుంచి 14 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. అభ్యర్థులకు సెప్టెంబరు 9 - 16 మధ్య ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. ఇక ప్రత్యేక కేటగిరి అభ్యర్థులకు సెప్టెంబరు 12న అర్హత పత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ సెప్టెంబరు 19 నుంచి 21 వరకు కొనసాగనుంది. సెప్టెంబరు 22న వెబ్ఆప్షన్లలో మార్పునకు అవకాశం ఇచ్చి, సెప్టెంబరు 25న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు 26న కళాశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. సెప్టెంబరు 27 నుంచి తరగతులు ప్రారంభంకాన్నాయి.
కౌన్సెలింగ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..