SSC Exam Fee: ప‌దోత‌ర‌గ‌తి వార్షిక ప‌రీక్ష‌ల ఫీజు షెడ్యూల్ విడుద‌ల‌, ముఖ్యమైన తేదీలివే

తెలంగాణలో ప‌దోత‌ర‌గ‌తి వార్షిక ప‌రీక్ష‌ల ఫీజు షెడ్యూల్ విడుద‌లైంది. విద్యార్థులు న‌వంబ‌ర్ 17 లోపు పరీక్ష  ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆల‌స్య రుసుముతో డిసెంబ‌ర్ 20 వ‌ర‌కు ఫీజు చెల్లించవచ్చు..

Continues below advertisement

తెలంగాణలో పదోతరగతి పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూలు నవంబరు 2న విడుదలైంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం విద్యార్థులు నవంబర్ 17 వరకు విద్యార్థులు ఫీజు చెల్లించవచ్చని ప్ర‌భుత్వ ప‌రీక్ష‌ల డైరెక్ట‌ర్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే రూ.50 ఆలస్యరుసుముతో డిసెంబరు 1 వరకు, రూ.200 ఆలస్యరుసుముతో డిసెంబరు 11 వరకు, రూ.500 ఆలస్యరుసుముతో డిసెంబరు 20 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు దీనిపై దృష్టి సారించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగింపు ఉండదని ప్రకటలో స్పష్టం చేశారు. పరీక్ష ఫీజు చెల్లించే విద్యార్థుల వయసు 14 సంవత్సరాలు నిండి ఉండాలి.

Continues below advertisement

ఫీజు చెల్లింపు తేదీలు..

➥ ఫీజు చెల్లించడానికి చివరితేది: 17.11.2023.

➥ రూ.50 ఆలస్యరుసుముతో ఫీజు చెల్లించడానికి చివరితేది: 01.12.2023.

➥ రూ.200 ఆలస్యరుసుముతో ఫీజు చెల్లించడానికి చివరితేది: 11.12.2023.

➥ రూ.500 ఆలస్యరుసుముతో ఫీజు చెల్లించడానికి చివరితేది: 20.12.2023.

ఫీజు చెల్లింపు వివరాలు..

➥ 6 సబ్జెక్టులకు రాయాలనుకునే రెగ్యులర్ విద్యార్థులకు పరీక్ష ఫీజు: రూ.125 

➥ 3 సబ్జెక్టుల వరకు రాయాలనుకునే విద్యార్థులకు పరీక్ష ఫీజు: రూ.110

➥ 3 సబ్జెక్టులకు మించి పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులకు పరీక్ష ఫీజు: రూ.125.

➥ ఒకేషనల్ విద్యార్థులకు పరీక్ష ఫీజు: రూ.60.

వీరికి ఫీజు నుంచి మినహాయింపు..
* కుంటంబ వార్షిక ఆదాయం ఏడాదికి పట్టణాల్లో రూ.24 వేలకు మించకూడదు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.20 వేలకు మించకూడదు (లేదా) 2.5 ఎకరాల సాగు భూమి, 5 ఎకరాల బంజరు భూమి ఉన్నవారికి ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. 

తెలంగాణలో పదోతరగతి వార్షిక పరీక్షలు వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. వొకేషనల్ ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు కూడా అదే నెలలో ఉంటాయని తెలిపారు. గతేడాది నుంచి 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లకే 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు పరీక్షల పూర్తి షెడ్యూల్ ను త్వరలోనే రిలీజ్ చేస్తామని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. కాగా పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల నామినల్ రోల్స్‌ను ఇక మీద నుంచి ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుందని విద్యాశాఖ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 

తెలంగాణలో పాఠశాల విద్యార్థుల సమగ్ర సమాచారాన్ని పొందుపరిచే 'యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం ఫర్‌ ఎడ్యుకేషన్‌(యూడైస్‌)'లో పేరు ఉంటేనే పదోతరగతి పరీక్షలకు అనుమతించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అక్టోబరు 16న కీలక నిర్ణయం తీసుకుంది. పది పరీక్షలకు ఫీజు చెల్లించిన తర్వాత ఆయా పాఠశాలలు ప్రభుత్వ పరీక్షల విభాగానికి విద్యార్థుల పేర్లు, ఇతర సమగ్ర వివరాలతో కూడిన నామినల్‌రోల్స్‌ను పంపిస్తాయి. అనుమతి లేని పాఠశాలల్లో చదివే పిల్లలను మరో బడి నుంచి పరీక్షలు రాయిస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకే ఇప్పటి నుంచి యూడైస్‌లో పేరు ఉంటేనే పదోతరగతి పరీక్షలకు అనుమతి ఇస్తారు. 

ALSO READ:

ఏపీ 'టెన్త్' విద్యార్థులకు అలర్ట్‌, పరీక్ష ఫీజు షెడ్యూలు విడుదల - ఎప్పటిదాకా ఫీజు చెల్లించవచ్చంటే?
ఏపీలో పదోతరగతి పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూలు విడుదలైంది. అక్టోబరు 28 నుంచి నవంబర్ 10 వరకు విద్యార్థులు ఫీజు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానంద రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అయితే రూ.50 ఆలస్యరుసుముతో నవంబరు 11 నుంచి 16 వరకు, రూ.200 ఆలస్యరుసుముతో నవంబరు 17 నుంచి 22 వరకు, రూ.500 ఆలస్యరుసుముతో నవంబరు 23 నుంచి 30 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు దీనిపై దృష్టి సారించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగింపు ఉండదని ఆయన స్పష్టంచేశారు. పరీక్ష ఫీజు చెల్లించే విద్యార్థుల వయసు 31.08.2023 నాటికి 14 సంవత్సరాలు నిండి ఉండాలి.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

 

Continues below advertisement
Sponsored Links by Taboola