ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ఇంటర్ బోర్డు 9 రోజులపాటు దసరా సెలవులను ప్రకటించింది. అకడమిక్ క్యాలెండర్‌ ప్రకారం అక్టోబరు 2 నుంచి 9 వరకు దసరా సెలవులు ఉంటాయని ఇంటర్ బోర్డ్ వెల్లడించింది. అక్టోబరు 10న కళాశాలలు తిరిగి తెరచుకోనున్నాయి. రాష్ట్రంలోని అన్ని  ప్రైవేట్‌, ఎయిడెడ్‌, ప్రభుత్వ ఇంటర్ కళాశాలలకు అక్టోబర్‌ 2 నుంచి 9 వరకు మొత్తం ఎనిమిది రోజుల పాటు దసరా సెలవులు ఇస్తున్నట్లు తెలిపింది. సెలవురోజుల్లో తరగతులు నిర్వహిస్తే కఠినచర్యలు ఉంటాయని కళాశాలలను హెచ్చరించింది.



తెలంగాణలోని పాఠశాలలకు ప్రభుత్వం ఇప్పటికే దసరా సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని పాఠశాలలకు సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 8 వరకు మొత్తం 13 రోజుల సెలవులు ప్రకటించింది. అయితే సెప్టెంబరు 25, అక్టోబరు 9 ఆదివారాలు ఉండటంతో మొత్తంగా 15 రోజుల సెలవులు వచ్చినట్లయింది. 



ఏపీలో సెలవులు ఇలా..
ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలకు అక్టోబరు 26 నుంచి అక్టోబరు 6 వరకు దసరా సెలవులను విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు సెప్టెంబరు 13న అధికారిక ప్రకటన చేసింది. సెప్టెంబరు 25న ఆదివారం కావడంతో మొత్తం 12రోజులు సెలవులు రానున్నాయి. ఇక క్రిస్టియన్‌, ఇతర మైనారిటీ పాఠశాలలకు మాత్రం అక్టోబరు 1 నుంచి 6 వరకు సెలవులు ఇచ్చారు.


సెలవుల తర్వాత ఫార్మెటివ్‌-1 పరీక్షలు..
సెలవుల తర్వాత ఫార్మెటివ్‌-1 పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఓమ్మార్‌ షీట్‌తో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓఎమ్మార్‌ షీట్ల ముద్రణ పూర్తికాకపోవడంతో పరీక్షలను వాయిదా వేస్తూ వస్తున్నారు. పాఠశాల స్థాయిలో నిర్వహించే పరీక్షలకు రూ.కోట్లు వెచ్చించి, ఓఎమ్మార్‌ షీట్లు ముద్రించడంపై విమర్శలు వస్తున్నాయి.



ఏపీ ప్రభుత్వం ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెలవులు ఇవే..
♦ ఈ ఏడాది విద్యార్థులకు సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబరు 6 వరకు దసరా సెలవులు. 
♦ క్రిస్టియన్‌ మైనారిటీ పాఠశాలలకు దసరా సెలవులు అక్టోబరు 1 నుంచి 6వ తేదీ వరకు ఇస్తారు. 
♦ క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకూ ఇస్తారు.
♦ సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 16 వరకు ప్రకటించింది.


 


Also Read

NVS: నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదో తరగతి ప్రవేశాలు, పరీక్ష ఎప్పుడంటే?

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను తొమ్మిదో తరగతిలో ప్రవేశాల కోసం నవోదయ విద్యాలయ సమితి ప్రకటన విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న  650 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి ప్రవేశాలు కల్పిస్తారు. రాతపరీక్ష ఆధాంగా విద్యార్థులను ఎంపికచేస్తారు. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ప్రవేశప్రకటన, ఎంపిక విధానం వివరాల కోసం క్లిక్ చేయండి..


 


Also Read


జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్ టైమ్ పీజీ కోర్సులు, చివరితేది ఎప్పుడంటే?
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి ఎంటెక్, ఎంబీఏ పార్ట్‌టైమ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబరు 17 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబరు 15 నుంచి 17 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
కోర్సులు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..