తెలంగాణలోని నిరుద్యోగ యువతీ, యువకులకు సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైబర్‌ సెక్యూరిటీ డైరెక్టర్‌ విమలారెడ్డి ఆగస్టు 6న ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌, డిప్లొమా, పీజీ డిప్లొమా ఇన్‌ సైబర్‌ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌, సైబర్‌ సెక్యూరిటీ ఎథికల్‌ హ్యాకింగ్‌ సర్టిఫికేట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని ఆమె వెల్లడించారు. ఈ కోర్సులకు ఇంటర్‌, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆగ‌స్టు 19లోపు ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇత వివరాలకు 78931 41797లో సంప్రదించాలని విమలారెడ్డి సూచించారు.


వివరాలు..


* సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేట్ కోర్సులు


1) సైబర్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌


2) డిప్లొమా


3) పీజీ డిప్లొమా ఇన్‌ సైబర్‌ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌


4) సైబర్‌ సెక్యూరిటీ ఎథికల్‌ హ్యాకింగ్‌ సర్టిఫికేట్


అర్హత: ఇంటర్‌, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌ డిప్లొమా.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తుకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే 78931 41797 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 19.08.2023.


ప్రాస్పెక్టస్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి.. 


వెబ్‌సైట్


ALSO READ:


సీపెట్‌‌లో స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సుల్లో ఉచిత శిక్షణ..
ఆంధ్రప్రదేశ్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ (సీపెట్) ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణకు దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైనవారికి మెషీన్‌ ఆపరేటర్‌-ప్లాస్టిక్స్‌ ప్రాసెసింగ్‌ విభాగాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందిస్తున్నట్లు కేంద్ర పెట్రోకెమికల్స్‌ ఇంజినీరింగ్‌, టెక్నాలజీ సంస్థ(సీపెట్‌) జేడీ సీహెచ్‌ శేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్‌తోపాటు అనంతపురం, హైదరాబాద్‌, బెంగళూరు, హోసూర్‌, చెన్నై ప్రాంతాల్లో ప్రముఖ ప్లాస్టిక్స్‌, అనుబంధ సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి సదుపాయాలు ఉంటాయి. పదోతరగతి ఉత్తీర్ణులైనవారు అర్హులు. ఫోన్‌ నంబరు 6300147965 ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని, ఆగస్టు 11 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని వెల్లడించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


ఆర్‌ఐఎంసీలో 8వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!
డెహ్రాడూన్‌‌లోని రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజ్‌(ఆర్‌ఐఎంసీ)లో ఎనిమిదో తరగతి (2024 జులై సెషన్) ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. స్థానిక బాలురు, బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, వైవా, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. సరైన అర్హతలున్న విద్యార్థులు అక్టోబరు 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. వీరికి డిసెంబరు 2న ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


నవోదయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ - పరీక్ష విధానం, ఎంపిక, అర్హతల వివరాలు ఇలా!
జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యాసంవత్సరాకిగాను ఆరోతరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ ఏడాది రెండు విడతల్లో ఎంపిక పరీక్ష నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 20న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ ఏడాది నవంబరు 4న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే చాలు.. ఇంటర్‌ దాకా ఉచితంగా చదువు, వసతి, భోజనం కల్పిస్తారు. బోధన కూడా అత్యున్నత ప్రమాణాల్లో ఉంటుంది. ప్రవేశ పరీక్షకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19న ప్రారంభంకాగా, ఆగస్టు 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.  
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..