Today General Knowledge Questions: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం గ్రూప్ 2, డీఎస్సీ కోసం లక్షల మంది ప్రిపేర్ అవుతున్నారు. తెలంగాణలో గ్రూప్ 3, గ్రూప్-2, టెట్ కోసం సన్నద్ధమవుతున్నారు. బ్యాంకు, ఇతర జాతీయ పోటీ పరీక్షల కోసం రెడీ అవుతున్న వాళ్లు కోట్లలో ఉన్నారు. అలాంటి వారందరికీ ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ అండ్ స్టాక్ జీకే ఇక్కడ ఇస్తున్నాం.
1. బుర్ర కథ పితామహుడు షేక్ నాజర్ వలి యొక్క జీవిత చరిత్రను తెలిపే పుస్తకం పేరు? పింజారీ
2. భరతనాట్య శిక్షణ కొరకు రుక్మిణీదేవి స్థాపించిన సంస్థ పేరు ఏమిటి? కళాక్షేత్ర
3. గౌతమ బుద్ధుని గత జన్మల గురించి తెలిపే కథలను ఏమంటారు? జాతక కథలు
4. శస్త్ర చికిత్సల గురించి తెలిపే ప్రాచీన గ్రంథము ఏది? శుశృత సంహిత
5. అంబేద్కర్ జీవిత చివరి దశలో స్వీకరించిన మతం పేరేమిటి? బౌద్ధమతం
6. కుల వ్యవస్థను బానిసత్వంగా పరిగణిస్తూ జ్యోతిబా పూలే చేసిన రచన పేరేమిటి? గులాంగిరి
7. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే...... అనే కీర్తనను రచించిన వాగ్గేయకారుడు ఎవరు? తాళ్లపాక అన్నమాచార్యులు
8. జాతీయ మానవ హక్కుల సంఘం ఏర్పడిన సంవత్సరం? 1993
9. విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన తేది? 2010 ఏప్రిల్ 1
10. భూదాన ఉద్యమ పితామహుడుగా పేరుపొందిన ఆచార్య వినోబా భావే. అయితే ఈ ఉద్యమం ద్వారా మొదటగా భూమిని దానంగా పొందినది ఎవరు? మైసయ్య
11. ప్రథమ చికిత్స కు సంబంధించి గోల్డెన్ అవర్ అనగా? ప్రమాదం జరిగిన మొదటి గంట
12. గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయుటకు కావలసిన కనీస వయసు ఎంత? 21 సంవత్సరాలు
13. భారతదేశ మొదటి ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు? రాజకుమారి అమృత కౌర్
14. దండియాత్రలో భాగంగా గాంధీజీ దండి అనే గ్రామమునకు చేరుకున్న రోజు? 1930 ఏప్రిల్ 6
15. పాకిస్తాన్ అనే పేరును సూచించినది ఎవరు? చౌదరీ రహ్మత్ ఆలీ.