కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు సంబంధించి విద్యార్థుల అప్లికేషన్ కరెక్షన్ విండోను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఓపెన్ చేసింది. సెప్టెంబరు 15 వరకు తెరచి ఉంటుంది. దరఖాస్తు సమయంలో ఏమైనా పొరపాట్లు దొర్లినవారు అప్లికేషన్‌లో సవరణలు చేసుకోవచ్చు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ వివరాలను ఎడిట్ చేసుకోవచ్చు. ఇందుకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.



CUET UG అప్లికేషన్‌ను ఎలా కరెక్షన్ చేయాలి?


1. ముందు CUET అధికారిక వెబ్‌సైట్ cuet.samarth.ac.in ఓపెన్ చేయండి.


2. మీ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ వివరాలను ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.


Direct Link - https://cuet.samarth.ac.in/index.php/site/login


3. ఇప్పుడు CUET అప్లికేషన్ కరెక్షన్ లింక్‌పై క్లిక్ చేయండి.


4. మీ స్క్రీన్‌పై కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది.


5. ఫారమ్‌లో తగిన మార్పులు చేసి, సబ్‌మిట్ చేయండి.


6. ఫారమ్ ఫైనల్ కాపీని, కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేయండి.



దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యాసంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 259 నగరాల్లో, 489 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 6 విడతల్లో కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ (CUET-2022) నిర్వహించిన సంగతి తెలిసిందే. జులై 15, 16,19, 20; ఆగస్టు 4, 5, 6,7, 8, 10 తేదీల్లో CUET -2022 పరీక్షలు నిర్వహించారు. హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఉర్దూ, అస్సామీ, బెంగాలీ, పంజాబీ, ఒడియా, ఇంగ్లీష్ వంటి 13 భాషలలో పరీక్షను నిర్వహించారు. సాంకేతికమైన, పరిపాలనాపరమైన సమస్యలు తలెత్తడంతో ఆగస్టు 4 నుంచి 6 వరకు వాయిదా పడిన సీయూఈటీ-యూజీ(CUET-UG ) పరీక్షను ఆగస్టు 24, నుంచి 30 వరకు నిర్వహించారు. సీయూఈటీ పరీక్ష కోసం దాదాపు 14,90,000  మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష ఫలితాల ఆధారంగా దేశంలోని 45 సెంట్రల్ యూనివర్సిటీలు అందించే అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు కల్పిస్తారు.


ఫలితాల కోసం వెబ్‌సైట్: https://cuet.samarth.ac.in/



15న సీయూఈటీ ఫలితాలు..!
దేశంలోని వివిధ ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష(సీయూఈటీ)-యూజీ ఫలితాలు సెప్టెంబర్15 లోగా వెలువడుతాయని యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు. డిగ్రీ కోర్సులకు తొలిసారిగా నిర్వహించిన ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు జులైలో ప్రారంభమై ఆగస్టు 30న ముగిశాయి. ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) సెప్టెంబర్15 నాటికి వెల్లడిస్తుందని, సాధ్యమైతే ఆ తేదీ కన్నా రెండు రోజులు ముందే ప్రకటించే అవకాశం ఉందన్నారు. గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి దూరవిద్య, సార్వత్రిక, ఆన్‌లైన్ విధానంలో పూర్తిచేసిన డిగ్రీ/పీజీ కోర్సులను రెగ్యులర్ డిగ్రీ/పీజీ కోర్సులతో సమానంగానే పరిగణిస్తామని యూజీసీ తెలిపింది. యూజీసీ రెగ్యులేషన్ 22 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ కార్యదర్శి రజీనీశ్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు.




 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..