CUET UG Result: దేశంలోని వివిధ ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష(సీయూఈటీ)-యూజీ ఫలితాలు సెప్టెంబర్15న వెలువడనున్నాయి. రాత్రి 10 గంటలకు ఫలితాలను ప్రకటించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. సీయూఈటీ పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఫలితాలు విడుదలయ్యాక వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలు తెలుసుకోవచ్చు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టిన తేది వివరాలు నమోదుచేసి తమ ఫలితాలను వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఫలితాల కోసం వెబ్‌సైట్: https://cuet.samarth.ac.in/
దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యాసంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 259 నగరాల్లో, 489 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 6 విడతల్లో కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ (CUET-2022) నిర్వహించిన సంగతి తెలిసిందే. జులై 15, 16,19, 20; ఆగస్టు 4, 5, 6,7, 8, 10 తేదీల్లో CUET -2022 పరీక్షలు నిర్వహించారు. సాంకేతికమైన, పరిపాలనాపరమైన సమస్యలు తలెత్తడంతో ఆగస్టు 4 నుంచి 6 వరకు వాయిదా పడిన సీయూఈటీ-యూజీ(CUET-UG ) పరీక్షను ఆగస్టు 24, నుంచి 30 వరకు నిర్వహించారు.
ఈ పరీక్ష కోసం దాదాపు 14,90,000 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి దూరవిద్య, సార్వత్రిక, ఆన్‌లైన్ విధానంలో పూర్తిచేసిన డిగ్రీ/పీజీ కోర్సులను రెగ్యులర్ డిగ్రీ/పీజీ కోర్సులతో సమానంగానే పరిగణిస్తామని విశ్వ విద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) తెలిపింది.
మార్కుల కేటాయింపు ఇలా..
♦ అభ్యర్థి రాసిన సరైన సమాధానానికి ఐదు మార్కులు (+5) కేటాయిస్తారు.
♦ ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్క్ మైనస్ (-1) చేస్తారు.
♦ ఆన్సర్ చేయకుండా వదిలివేసిన ప్రశ్నలకు ఎలాంటి మార్కులు ఇవ్వరు.
♦ ఫైనల్ రిజల్ట్స్‌లో ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్స్ సరైనవని తేలితే, సరైన ఆప్షన్స్‌లో దేనినైనా గుర్తించిన వారికి మాత్రమే ఐదు మార్కులు ఇస్తారు.
♦ ప్రశ్నకు ఇచ్చిన అన్ని ఆప్షన్స్ సరైనవని గుర్తిస్తే.. ప్రశ్నను ప్రయత్నించిన వారందరికీ ఐదు మార్కులు (+5) కేటాయిస్తారు.
♦ ఆప్షన్స్‌లో ఏదీ సరైనది కాకపోయినా లేదా ఏదైనా ఒక ప్రశ్న తప్పుగా వచ్చినా లేదా క్వశ్చన్‌ను డ్రాప్ చేసినా.. డ్రాప్ చేసిన ప్రశ్నను ప్రయత్నించిన అభ్యర్థులందరికీ ఐదు మార్కులు (+5) ఇవ్వనున్నారు.
దరఖాస్తుల సవరణకు అవకాశం
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు సంబంధించి విద్యార్థుల అప్లికేషన్ కరెక్షన్ విండోను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఓపెన్ చేసింది. సెప్టెంబరు 15 వరకు తెరిచి ఉంటుంది. దరఖాస్తు సమయంలో ఏమైనా పొరపాట్లు దొర్లినవారు అప్లికేషన్‌లో సవరణలు చేసుకోవచ్చు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ వివరాలను ఎడిట్ చేసుకోవచ్చు. ఇందుకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
CUET UG అప్లికేషన్‌ను ఎలా కరెక్షన్ చేయాలి?
1. ముందు CUET అధికారిక వెబ్‌సైట్ cuet.samarth.ac.in ఓపెన్ చేయండి.
2. మీ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ వివరాలను ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
3. ఇప్పుడు CUET అప్లికేషన్ కరెక్షన్ లింక్‌పై క్లిక్ చేయండి.
4. మీ స్క్రీన్‌పై కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది.
5. ఫారమ్‌లో తగిన మార్పులు చేసి, సబ్‌మిట్ చేయండి.
6. ఫారమ్ ఫైనల్ కాపీని, కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేయండి.
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..