CUET UG 2025 Registration: దేశవ్యాప్తంగా ఉన్న 46 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికిగానూ వివిధ యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న"కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ(CUET UG)-2025"కు సంబంధించి దరఖాస్తుల స్వీకరణను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రారంభించింది. మార్చి 22 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. అయితే మార్చి 23న రాత్రి 11.50 గంటల వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మే 8 నుంచి జూన్ 1 మధ్య పరీక్షలు నిర్వహించనుంది. మొత్తం 37 సబ్జెక్టులకు పరీక్షలు జరుగనున్నాయి. ఇందులో 13 భారతీయ భాషలకు సంబంధించినవి కాగా.. 23 డొమైన్ ఆధారత సబ్జెక్టులు, 1 జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా 285 కేంద్రాల్లో, విదేశాల్లో 15 కేంద్రాలు పరీక్షలు నిర్వహించనున్నారు.
సీయూఈటీ యూజీ స్కోరు ప్రవేశ పరీక్ష స్కోరు ఆధారంగా దేశంలోని కేంద్రీయ వర్సిటీలతోపాటు, ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీలు సైతం ప్రవేశాలు కల్పిస్తాయి. వీటిలో 12 రాష్ట్ర యూనివర్సిటీలు, 11 డీమ్డ్ వర్సిటీలు, 19 ప్రైవేటు యూనివర్సిటీలతో కలిపి మొత్తం 99 యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం 13 భాషల్లో సీయూఈటీ యూజీ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఏదైనా ఒక లాంగ్వేజ్ పరీక్షను తప్పక రాయాల్సి ఉంటుంది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాలం, హిందీ, ఉర్దూ, గుజరాతీ, మరాఠీ, అస్సామీ, పంజాబీ, బెంగాళీ, ఒరియా, ఇంగ్లిష్‌లలో ఏదైనా ఒక భాషను ఎంచుకోవచ్చు.
వివరాలు..
* కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (యూజీ) - 2025
అర్హత: ఇంటర్మీడియట్/ తత్సమాన అర్హత కలిగి ఉండాలి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: సీయూఈటీ (యూజీ)-2025 కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా.
పరీక్ష విధానం: యూజీ పరీక్ష మూడు సెక్షన్లుగా జరుగుతుంది. మొదటి సెక్షన్(1ఎ, 1బి) లాంగ్వేజ్‌లో, రెండో సెక్షన్ స్పెసిఫిక్ సబ్జెక్టులో, మూడో సెక్షన్ జనరల్ టెస్ట్‌లో మల్టిఫుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు 5 మార్కులు. తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. మొదటి సెక్షన్‌లో 50 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. రెండో సెక్షన్‌లోనూ 50 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. మూడో సెక్షన్‌లో 60 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఒక్కో పేపరుకు 60 నిమిషాల సమయం కేటాయించారు.
ఏపీలోని పరీక్ష కేంద్రాలు: అనంతపురం, భీమవరం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నర్సరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెం, మచిలీపట్నం, నంద్యాల, తాడేపల్లిగూడెం.
తెలంగాణలోని పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్.
ముఖ్యమైన తేదీలు..
➸ సీయూఈటీ యూజీ -2025 నోటిఫికేషన్: 01.03.2025.
➸ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.03.2025.
➸ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 22.03.2025. (రాత్రి 11:50 గంటల వరకు)
➸ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 23.03.2025 (రాత్రి 11:50 గంటల వరకు)
➸ దరఖాస్తుల సవరణ: 24.03.2025 - 26.03.2025 వరకు
➸ పరీక్ష కేంద్రాల ప్రకటన: తర్వాత ప్రకటిస్తారు.
➸ అడ్మిట్‌కార్డుల డౌన్‌లోడ్: తర్వాత ప్రకటిస్తారు.
➸ పరీక్ష తేదీలు: 08.05.2025 - 01.06.2025 మధ్య.