కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ పీజీ (CUET PG) – 2022 పరీక్ష ఫలితాలు వెలుబడ్డాయి. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పీజీ ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టిన తేది వివరాలు నమోదుచేసి తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. 


ఇటీవలే ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆన్సర్ కీని అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పీజీ ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులు, ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు తెలిపిన అభ్యర్థులు ఫలితాలు వచ్చేలోపు ఆన్సర్ కీ చూసుకోవచ్చు. మార్కులపై ఓ అంచనాకు రావచ్చు.


CUET PG -2022 ఫలితాలు ఇలా చూసుకోవాలి...
1. సీయూఈటీ పీజీ ఫలితాల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. CUET PG - cuet.nta.nic.in
2. అక్కడ హోంపేజీలో కనిపించే 'CUET PG RESULT 2022' లింక్ మీద క్లిక్ చేయాలి.
3. ఫలితాలకు సంబంధించిన లాగిన్ పేజీ ఓపెన్ అవుతోంది.
4. అక్కడ అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టిన తేది వివరాలు నమోదుచేయాలి. 
5. అభ్యర్థుల ఫలితాలు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి. ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.



CUET PG - 2022 ఫలితాల కోసం క్లిక్ చేయండి..


ఫలితాల పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..



సెప్టెంబరు 16న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సీయూఈటీ ప్రాథమిక కీని విడుదల చేసిన సంగతి తెలిసిందే.  ఆన్సర్ కీపై అభ్యర్థుల నుంచి సెప్టెంబరు 18 వరకు అభ్యంతరాలు స్వీకరించింది. అనంతరం సెప్టెంబరు 24న తుది కీని విడుదల చేసింది. ఈ ఏడాది పీజీ ప్రవేశపరీక్షకు మొత్తం 1.9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.



కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ఈ పరీక్షను యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ తరఫున ఎన్‌టీఏ నిర్వహించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 1 నుంచి 12 వరకు రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌ పరీక్ష జరిగింది. పరీక్ష ప్రాథమిక కీని సెప్టెంబరు 16న విడుదల చేయగా.. ఫైనల్ కీని సెప్టెంబరు 24న విడుదల చేశారు. 



ఈ ఏడాది సీయూఈటీ పీజీ ప్రవేశ పరీక్షకు దేశవ్యాప్తంగా 3.6 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 1.8 లక్షల మంది బాలురు, 1.7 లక్షల మంది బాలికలు ఉన్నారు. వీరిలో ప్రవేశ పరీక్షకు 1.9 లక్షల మంది హాజరయ్యారు. 55 శాతం హాజరు నమోదైంది. తాజాగా పరీక్ష ఫలితాలు వెలుబడ్డాయి.


 


ఇవి కూడా చదవండి..



⇒   జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్ టైమ్ పీజీ కోర్సులు, చివరితేది ఎప్పుడంటే?


⇒  
నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదో తరగతి ప్రవేశాలు, పరీక్ష ఎప్పుడంటే?



⇒  
AUSDE: ఏయూ దూరవిద్య కోర్సుల నోటిఫికేషన్‌ విడుదల


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..