కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డు లిమిటెడ్, మెరైన్ ఇంజినీరింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ 2023 విద్యా సంవత్సరానికి గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఈ, బీటెక్ (మెకానికల్ ఇంజినీరింగ్, మెకానికల్ స్ట్రీమ్ ఆఫ్ ఇంజినీరింగ్, నేవల్ ఆర్కిటెక్చర్ స్ట్రీమ్ ఆఫ్ ఇంజినీరింగ్, మెరైన్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల విద్యార్థులు జులై 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రోగ్రామ్ వివరాలు..
* గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్
సీట్ల సంఖ్య: 114.
కోర్సు వ్యవధి: 12 నెలలు- రెసిడెన్షియల్
బ్యాచ్‌ల సంఖ్య: 02
అర్హత: బీఈ, బీటెక్ (మెకానికల్ ఇంజినీరింగ్, మెకానికల్ స్ట్రీమ్ ఆఫ్ ఇంజినీరింగ్, నేవల్ ఆర్కిటెక్చర్ స్ట్రీమ్ ఆఫ్ ఇంజినీరింగ్, మెరైన్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: అకడమిక్ మెరిట్, మెడికల్ ఫిట్‌నెస్, సైకలాజికల్ స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తుకు చివరి తేదీ: 15.07.2023.
Notification
ALSO READ:
ఇంటిగ్రేటెడ్ బీఈడీ సీట్ల భర్తీకి ఎన్‌సెట్ నోటిఫికేషన్ వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!
ఇంటర్ విద్యార్హతతో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సులో ప్రవేశాలకు 2023-24 విద్యా సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(NCET) పేరిట జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి ఉన్నవారు జూన్ 27 నుంచి జులై 19 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పరీక్షల తేదీలను ఎన్టీఏ తర్వాత ప్రకటించనుంది. నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా బీఏ-బీఈడీ, బీఎస్‌ఈ-బీఈడీ, బీకాం-బీఈడీలను ప్రవేశపెట్టాలనే కేంద్రం నిర్ణయం మేరకు ఆ కోర్సులను రాష్ట్రంలో ఐఐటీలు, ఎన్‌ఐటీలు, కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఈ సంవత్సరమే కొత్తగా ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే రీజనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లు ఐదు ఉండగా వాటిలో ఉన్న కోర్సుల్లో సీట్ల భర్తీకి జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష జరుపుతారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణలో మరో 14,565 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి
తెలంగాణలో మరో 14,565 ఇంజినీరింగ్ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తెలిపింది. కోర్ గ్రూపుల్లో సీట్లు వెనక్కి ఇస్తామని పేర్కొంటూ ఇంజినీరింగ్ కాలేజీలు కంప్యూటర్ కోర్సుల్లో సీట్లకు అనుమతి కోరాయి. దీంతో 6,930 సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే కొత్తగా 7,635 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఖరారు చేసింది. ఫలితంగా అదనపు సీట్లతో ఏటా సర్కారుపై రూ. 27.39 కోట్ల భారం పడనుంది. ఇటీవల 86,106 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, తాజాగా అనుమతిచ్చిన వాటితో కలిపి రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్ల సంఖ్య 1,00,671కి చేరింది.
సీట్ల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
నవోదయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ - పరీక్ష విధానం, ఎంపిక, అర్హతల వివరాలు ఇలా!
జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యాసంవత్సరాకిగాను ఆరోతరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఏడాది రెండు విడతల్లో ఎంపిక పరీక్ష నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 20న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ ఏడాది నవంబరు 4న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే చాలు.. ఇంటర్ దాకా ఉచితంగా చదువు, వసతి, భోజనం కల్పిస్తారు. బోధన కూడా అత్యున్నత ప్రమాణాల్లో ఉంటుంది. ప్రవేశ పరీక్షకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19న ప్రారంభంకాగా, ఆగస్టు 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial