దేశంలోని వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో సైన్స్ విభాగంలో జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్(జేఆర్‌ఎఫ్), లెక్చరర్‌షిప్(ఎల్‌ఎస్‌)/ అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత కోసం నిర్వహించే సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్- జూన్ 2022 పరీక్షల ఫలితాలు అక్టోబర్ 29న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్‌ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేది వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. 


సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్‌ ఫలితాల కోసం క్లిక్ చేయండి..


ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..



నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సెప్టెంబరు 16 నుంచి 18 వరకు ఆన్‌లైన్ విధానంలో జాయింట్ సెంట్రల్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రిసెర్చ్-యూనివర్సిటీగ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CSIR-UGC NET, June 2022)ను నిర్వహించింది. దేశవ్యాప్తంగా 166 నగరాల్లో 338 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు మొత్తం 2,21,746 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని అక్టోబరు 1న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఆన్సర్ కీపై అభ్యంతరాలకు అవకాశం కల్పించింది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఫలితాలను విడుదల చేశారు.



Also Read:
 డీఆర్‌డీఓలో 1061 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల, ఈ అర్హతలు ఉండాలి!


సీఎస్ఐఆర్‌ యూజీసీ నెట్‌ గురించి..


సైన్స్‌ రంగంలో పరిశోధనలు సాగించాలనుకునే ప్రతిభావంతులకు చక్కటి మార్గంగా చెప్పవచ్చు. సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) జాతీయ స్థాయిలో ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ఈ పరీక్షలో ప్రతిభ ద్వారా జేఆర్‌ఎఫ్‌(జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌) సాధించిన విద్యార్థులకు ప్రముఖ సంస్థలో పరిశోధనలు చేసే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా యూజీసీ గుర్తింపు పొందిన కళాశాలల్లో ప్రొఫెసర్‌ /లెక్చరర్‌గా కెరీర్‌ ప్రారంభించవచ్చు. 

ఫెలోషిప్‌ ప్రయోజనాలు:

➦ సైన్స్‌ విద్యార్థులకు సీఎస్‌ఐఆర్‌ నెట్‌ కెరీర్‌ పరంగా అత్యంత ముఖ్యమైన పరీక్ష. ఇందులో అర్హత పొంది ఫెలోషిప్‌ సాధిస్తే చక్కటి కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. దేశంలోని గొప్ప సైంటిస్ట్‌లతో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుంది.

➦ సీఎస్‌ఐఆర్‌–యూజీసీ నెట్‌ ద్వారా జేఆర్‌ఎఫ్‌ సాధించిన అభ్యర్థులకు సీఎస్‌ఐఆర్‌ పరిశోధన సంస్థలతోపాటు ఇతర ప్రతిష్టాత్మక సంస్థల్లో పరిశోధనలు చేసే అవకాశం లభిస్తుంది. ఈ సమయంలో రెండేళ్ల పాటు నెలకు రూ.31వేల ఫెలోషిప్, అలాగే అదనంగా ఏటా కంటిన్‌జెన్సీ గ్రాంట్‌ కింద రూ.20వేలు పొందవచ్చు.

➦ రెండేళ్ల జేఆర్‌ఎఫ్‌ పూర్తిచేసుకున్న అభ్యర్థులు పీహెచ్‌డీకి రిజిస్టర్‌ చేసుకుంటే.. సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(ఎస్‌ఆర్‌ఎఫ్‌)గా ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో నెలకు రూ.35 వేలు ఫెలోషిప్‌ లభిస్తుంది.

➦ నేషనల్‌ ఫెలోషిప్‌ ఫర్‌ షెడ్యూల్‌ క్యాస్ట్‌ స్టూడెంట్స్, నేషనల్‌ ఫెలోషిప్‌ ఫర్‌ అదర్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్, మౌలానా అజాద్‌ నేషనల్‌ ఫెలోషిప్‌ ఫర్‌ మైనారిటీ స్టూడెంట్స్‌ వంటి ఫెలోషిప్‌లకు కూడా సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌లో ప్రతిభ ఆధారంగానే ఎంపిక చేస్తారు. 



Also Read:   SSC Recruitment:  24,369 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ! దరఖాస్తు చేసుకోండి!


లెక్చరర్‌/అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌:

➦ నెట్‌లో అర్హతతో దేశంలోని అన్ని డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీ/తత్సమాన హోదా ఉన్న సంస్థల్లో లెక్చరర్‌/అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా కెరీర్‌ ప్రారంభించవచ్చు. 

➦ తెలుగు రాష్ట్రాల్లో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు భర్తీ చేసే డిగ్రీ లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. నెట్‌/స్లెట్‌లో అర్హత తప్పనిసరి. 

➦ ఐఐటీ, ఐఐఎస్సీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో పరిశోధన కోర్సుల్లో ప్రవేశాలకు నెట్‌ /జేఆర్‌ఎఫ్‌ ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. అంతేకాకుండా ఓఎన్‌జీసీ వంటి కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు నియామకాల కోసం నెట్‌ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటాయి.



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...