CMAT 2024 Notification: దేశ‌వ్యాప్తంగా వివిధ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాముల్లో ప్రవేశాల‌కు నిర్వహించే కామ‌న్ మేనేజ్‌మెంట్ అడ్మిష‌న్ టెస్ట్ (సీమ్యాట్)-2024 ప్రక‌ట‌న‌ను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుద‌ల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. మార్చి 29న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా, ఏప్రిల్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.2000 చెల్లించాల్సి ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళలు, ట్రాన్స్ జెండర్లు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది.


వివరాలు..


* కామ‌న్ మేనేజ్‌మెంట్‌ అడ్మిష‌న్ టెస్ట్‌(సీమ్యాట్‌)-2024


అర్హత‌: ఏదైనా బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణత‌. డిగ్రీ చివ‌రి సంవ‌త్సరం చ‌దువుతున్న వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష ద్వారా.


దరఖాస్తు ఫీజు..


➦ జ‌న‌ర‌ల్- బాలురకు రూ.2000, బాలికలకు రూ.1000.


➦ జ‌న‌ర‌ల్-EWS /ఓబీసీ(నాన్‌క్రీమిలేయ‌ర్)/ఎస్సీ/ ఎస్టీ/ పీడ‌బ్ల్యూడీ బాలురకు రూ.1000, బాలికలకు రూ.1000.


➦ ట్రాన్స్‌జెండ‌ర్ అభ్యర్థులకు రూ.1000.


పరీక్ష విధానం..
మొత్తం 400 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 5 విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగానికి 80 మార్కులు కేటాయించారు. ఒక్కో విభాగం నుంచి 20 ప్రశ్నల చొప్పున మొత్తం 5 విభాగాల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు. క్వాంటిటేటివ్ టెక్నిక్స్ & డేటా ఇంటర్‌ప్రిటేషన్ 20 ప్రశ్నలు-80 మార్కులు, లాజికల్ రీజనింగ్ 20 ప్రశ్నలు-80 మార్కులు, లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ 20 ప్రశ్నలు-80 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 20 ప్రశ్నలు-80 మార్కులు, ఇన్నోవేషన్ & ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ 20 ప్రశ్నలు-80 మార్కులు ఉంటాయి. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. ఒక ప్రశ్నకు ఒక సమాధానం మాత్రమే గుర్తించాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ జవాబులు గుర్తించిన ప్రశ్నలను పరిగణనలోకి తీసుకోరు. నెగెటివ్ మార్కులు ఇస్తారు. ఆన్‌లైన్ విధానంలోనే పరీక్ష నిర్వహిస్తారు.



ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 29.03.2024.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 18.04.2024 (09:50 PM)


➥ ఫీజు చెల్లింపు ప్రక్రియ: 18.04.2024 (11:50 PM)


➥ దరఖాస్తుల సవరణ: 19.04.2024 - 21.04.2024.


➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: ప్రకటించాల్సి ఉంది.


➥ పరీక్ష తేది: ప్రకటించాల్సి ఉంది.


➥ పరీక్ష సమయం: 180 నిమిషాలు.


➥ ఫలితాల వెల్లడి: ప్రకటించాల్సి ఉంది.


Notification


Online Application


Website



ALSO READ:


JIPMAT 2024: ఇంటర్ అర్హతతో ఎంబీఏ ప్రవేశానికి 'జిప్‌మ్యాట్‌' మార్గం - నోటిఫికేషన్ విడుదల!
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) బోధ్‌గయ, ఐఐఎం జమ్మూ ఉమ్మడిగా అందిస్తున్న 'ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌(ఐపీఎం)లో ప్రవేశాలకు సంబంధించి జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జిప్‌మ్యాట్) - 2024 నోటిఫికేషన్‌‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ విడుదల చేసింది. ఇంటర్ అర్హతతో ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఐదేళ్ల ఇంటిగ్రేడెట్ ఎంబీఏ కోర్సులో చేరవచ్చు. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 22లోగా నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.2000 చెల్లించాలి. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది. జూన్ 6న నిర్వహించే పరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు. 
జీమ్యాట్ దరఖాస్తు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..