Undergraduate Degree Programmes of PJTSAU, SKLTSHU & PVNRTVU: తెలంగాణలోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ(హైదరాబాద్), శ్రీ కొండా లక్ష్మణ్ హార్టికల్చరల్ యూనివర్సిటీ (ములుగు, సిద్దిపేట జిల్లా), పీవీ నరసింహరావు వెటర్నరీ యూనివర్సిటీలు 2024-25 విద్యా సంవత్సరానికిగాను అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంయుక్తంగా నోటిఫికేషన్ విడుదల చేశాయి. దీనిద్వారా అగ్రికల్చర్, హార్టికల్చర్, కమ్యూనిటీ సైన్స్ వెటర్నరీ, ఫిషరీస్ సైన్స్ విభాగాల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఇంటర్ (బైపీసీ) అర్హతతోపాటు ఈఏపీసెట్ (ఎప్‌సెట్) ఉత్తీర్ణులైనవారు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థుల నుంచి జులై 12 నుంచి ఆగస్టు 18 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అయితే ఆగస్టు 17లోగా ఫీజు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా అభ్యర్థులు రూ.1800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ దరఖాస్తు వివరాల్లో తప్పులుంటే సరిదిద్దుకునేందుకు ఆగస్టు 19న అవకాశం కల్పించారు. విద్యార్థులు ఎప్‌సెట్ పరీక్షలో సాధించిన ర్యాంకు, రిజర్వేషన్లకు అనుగుణంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.
వివరాలు...
➦ బ్యాచిలర్ డిగ్రీ ప్రవేశాలు
యూనివర్సిటీలు: ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ-రాజేంద్రనగర్, హైదరాబాద్; శ్రీ కొండా లక్ష్మణ్ హార్టికల్చరల్ యూనివర్సిటీ-ములుగు, సిద్ధిపేట; పీవీ నరసింహరావు వెటర్నరీ యూనివర్సిటీ-రాజేంద్రనగర్, హైదరాబాద్.
మొత్తం సీట్ల సంఖ్య: 1372
సీట్ల కేటాయింపు (రిజిర్వేషన్లు): ఓసీ- 46 %, ఈడబ్ల్యూఎస్- 10 %, బీసీ ఎ - 7 %, బీసీ ఎ - 10 %, బీసీ సి - 1 %, బీసీ డి - 7 %, బీసీ ఈ - 7 %, ఎస్సీ- 15 %, ఎస్టీ- 10 %
కోర్సులు..
➥ బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్ (రెగ్యులర్, సెల్ఫ్ పైనాన్సింగ్) : 842 సీట్లు
కోర్సు వ్యవధి: 4 సంవత్సరాలు.
➥ బీఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్ (రెగ్యులర్, సెల్ఫ్ పైనాన్సింగ్) : 234 సీట్లు
కోర్సు వ్యవధి: 4 సంవత్సరాలు.
➥ బీఎస్సీ(ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్ (రెగ్యులర్, సెల్ఫ్ పైనాన్సింగ్) : 43 సీట్లు
కోర్సు వ్యవధి: 4 సంవత్సరాలు.
➥ బీటెక్(ఫుడ్ టెక్నాలజీ) (రెగ్యులర్, సెల్ఫ్ పైనాన్సింగ్) : 30 సీట్లు
కోర్సు వ్యవధి: 4 సంవత్సరాలు.
➥ బీవీఎస్సీ ఏహెచ్(ఏనిమల్ హస్బెండరీ): 184 సీట్లు
కోర్సు వ్యవధి: 5.5 సంవత్సరాలు.
➥ బీఎఫ్ఎస్సీ: 39 సీట్లు
కోర్సు వ్యవధి: 4 సంవత్సరాలు.
అర్హత: ఇంటర్మీడియట్ (బైపీసీ)తో పాటు తెలంగాణ ఈఎపీసెట్-2024 ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థుల వయసు 31.12.2024 నాటికి 17 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 25 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. దివ్యాంగులకు 27 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. ఇక బీవీఎస్సీ ఏహెచ్ కోర్సుకు మాత్రం 17 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 30 సంవత్సరాలలోపు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఎప్‌సెట్ (బైపీసీ స్ట్రీమ్)-2024 ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు రూ.1800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12-07-2024.
➥ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేది: 17-08-2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 18-08-2024.
➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 19-08-2024. (10 AM to 5 PM).