సీమ్యాట్-2023 పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా దేశవ్యాప్తంగా వివిధ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
సీమ్యాట్ ఫలితాలు ఇలా చూసుకోండి..
➥ ఫలితాల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి- https://cmat.nta.nic.in/
➥ అక్కడ హోంపేజీలోని 'Latest News' సెక్షన్‌లో కనిపించే 'CMAT 2023 Score Card' లింక్ మీద క్లిక్ చేయాలి.
➥ క్లిక్ చేయగానే వచ్చే లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి LOGIN బటన్‌పై క్లిక్ చేయాలి.
➥ అభ్యర్థులకు సంబంధించిన 'CMAT 2023' ఫలితాలు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
➥ సీమ్యాట్-2023 స్కోరుకార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలి.
➥ స్కోరుకార్డు డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.
సీమ్యాట్-2023 ఫలితాల కోసం క్లిక్ చేయండి..
దేశవ్యాప్తంగా మే 4న ఆన్‌లైన్ విధానంలో సీమ్యాట్-2023 ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, తిరిగి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్ష నిర్వహించారు. దేశంలోని 126 నగరాల్లో 248 కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సీమ్యాట్-2023 పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు మొత్తం 75,209 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 58,035 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష ఆన్సర్ కీని మే 12న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి మే 16 వరకు ఆన్సర్ కీ అభ్యంతరాలు స్వీకరించింది. తాజాగా ఫలితాలను విడుదల చేసింది.
పరీక్ష ఇలా సాగింది..
➥ మొత్తం 400 మార్కులకు రాతపరీక్ష నిర్వహించారు. పరీక్షలో మొత్తం 5 విభాగాల నుంచి ప్రశ్నలు ఇచ్చారు. ఒక్కో విభాగానికి 80 మార్కులు కేటాయించారు. ఒక్కో విభాగం నుంచి 20 ప్రశ్నల చొప్పున మొత్తం 5 విభాగాల సెనుంచి 100 ప్రశ్నలు అడిగారు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు.
➥ క్వాంటిటేటివ్ టెక్నిక్స్ & డేటా ఇంటర్‌ప్రిటేషన్ 20 ప్రశ్నలు-800 మార్కులు, లాజికల్ రీజనింగ్ 20 ప్రశ్నలు-80 మార్కులు, లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ 20 ప్రశ్నలు-80 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 20 ప్రశ్నలు-80 మార్కులు, ఇన్నోవేషన్ & ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ 20 ప్రశ్నలు-80 మార్కులు.
➥ పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. ఒక ప్రశ్నకు ఒక సమాధానం మాత్రమే గుర్తించాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ జవాబులు గుర్తించిన ప్రశ్నలను పరిగణనలోకి తీసుకోరు.
సీమ్యాట్ నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
తెలుగు యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల, కోర్సుల వివరాలు ఇలా!
హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023-23 విద్యాసంవత్సరానికి దూరవిద్య కేంద్రం (CDE) ద్వారా నిర్వహించే కోర్సుల్లో ప్రవేశాలకు మే 31న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా శిల్పం, చిత్రలేఖనం, డిజైన్స్, లైబ్రరీ సైన్స్, సంగీతం, రంగస్థలం, నృత్యం, జానపదం, తెలుగు, చరిత్ర, పర్యాటకం, భాషాశాస్త్రం, జర్నలిజం, జ్యోతిష్యం, యోగా తదితర అంశాలకు సంబంధించి.. డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ-బెంగళూరులో పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు!
బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ) ఆన్‌లైన్ అండ్ హైబ్రిడ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ప్రవేశాలకు అర్హులు. ఆన్‌లైన్ విధానంలో జులై 31 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..