TS PGECET - 2024: టీఎస్ పీజీఈసెట్ పరీక్షల షెడ్యూలులో మార్పులు, కొత్త తేదీలివే

TS PGECET - 2024 ప్రవేశపరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. జూన్ 6 నుంచి 9 వ‌ర‌కు పీజీఈసెట్ ప‌రీక్షలు జ‌ర‌గాల్సి ఉండగా..  జూన్ 10 నుంచి 13 వ‌ర‌కు నిర్వహించ‌నున్నారు.

Continues below advertisement

TS PGECET - 2024 Exam Schedule: టీఎస్ పీజీఈసెట్-2024 ప్రవేశపరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు సెట్ కన్వీన‌ర్ డాక్టర్ ఎ.అరుణ కుమారి శుక్రవారం (మే 17) ఒక ప్రక‌ట‌నలో తెలిపారు. రాష్ట్రంలో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమిన‌రీ ప‌రీక్షతోపాటు జాతీయస్థాయిలో స్టాఫ్ సెల‌క్షన్ క‌మిష‌న్ ఉద్యోగ ప‌రీక్షల నేప‌థ్యంలో టీఎస్ పీజీఈసెట్ ప‌రీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసిన‌ట్లు ఆయన వెల్లడించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జూన్ 6 నుంచి 9 వ‌ర‌కు పీజీఈసెట్ ప‌రీక్షలు జ‌ర‌గాల్సి ఉండగా..  జూన్ 10 నుంచి 13 వ‌ర‌కు నిర్వహించ‌నున్నారు. అభ్యర్థులు ఈ మార్పును గ‌మ‌నించాల‌ని క‌న్వీన‌ర్ కోరారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను మే 28 నుంచి అందుబాటులో ఉంచనున్నారు.

Continues below advertisement

ఆలస్యరుసుముతో దరఖాస్తుకు అవకాశం..
టీఎస్‌పీజీఈసెట్ 2024 దరఖాస్తు గడువు రూ.1000 ఆలస్యరుసుముతో మే 17న ముగిసిన సంగతి తెలిసిందే. రూ.2,500 ఆలస్య రుసుముతో మే 21 వరకు, రూ.5,000 ఆల‌స్య రుసుంతో మే 25 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది.  

వివరాలు...

* టీఎస్‌పీజీఈసెట్ - 2024

అర్హత: అభ్యర్థులు బీఈ/బీటెక్/బీఆర్క్/ బీప్లానింగ్/బీఫార్మసీ, ఎంఏ/ఎంఎస్సీ (సోషియాలజీ, ఎకనామిక్స్, జియోగ్రఫీ) ఉత్తీర్ణులై ఉండాలి. 

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో ర్యాంకు ఆధారంగా.

పరీక్ష విధానం:
మొత్తం 120 మార్కులకు కంప్యూటర్ విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటలు. పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కులు లేవు, పరీక్షలో కనీస అర్హత మార్కులను 25 శాతం (30 మార్కులు)గా నిర్నయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి అర్హత మార్కులు ఉండవు. ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్.

ముఖ్యమైన తేదీలు..

➥  పీజీసెట్‌ నోటిఫికేషన్‌: 12-03-2024.

➥  ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:  16-03-2024.

➥  ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ (అపరాధ రుసుము లేకుండా): 10-05-2024.

➥ దరఖాస్తుల సవరణ: 14-05-2024 - 16-05-2024.

➥ రూ.250 ఆల‌స్య రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 14-05-2024.

➥ రూ.1000 ఆల‌స్య రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 17-05-2024.

➥ రూ.2500 ఆల‌స్య రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 21-05-2024.

➥ రూ.5000 ఆల‌స్య రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 25-05-2024.

➥ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌: 28-05-2024 నుంచి.

➥ పరీక్ష తేదీలు: 10-06-2024 - 13-06-2024 వరకు.

తెలంగాణలోని పీజీ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్, ఎంఫార్మసీ, ఫార్మా-డి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'TS PGECET-2024' నోటిఫికేషన్ మార్చి 12న విడుదలైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 16న ప్రారంభమైంది. అభ్యర్థుల నుంచి ఎలాంటి అపరాధ రుసుము లేకుండా మే 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఇక రూ.250 ఆల‌స్య రుసుంతో మే 14 వ‌ర‌కు దరఖాస్తులు స్వీకరించారు. అదేవిధంగా రూ. 1000 ఆలస్య రుసుముతో మే 17 వరకు దరఖాస్తులు స్వీకరించారు. రూ.2,500 ఆలస్య రుసుముతో మే 21 వరకు, రూ.5,000 ఆల‌స్య రుసుంతో మే 25 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జూన్ 10 నుంచి 13 వ‌ర‌కు టీఎస్‌పీజీఈసెట్ పరీక్షలు నిర్వహించ‌నున్నారు. 

Notification

Examination Schedule

 Syllabus

Online Application

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement