MSME Tool Room: హైదరాబాద్‌లోని ఎంఎస్‌ఎంఈ టూల్ రూమ్ వివిధ విభాగాల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. పదోతరగతి అర్హత ఉన్నవారు డిప్లొమా కోర్సులకు అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్థులు రూ.800. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 19 సంవత్సరాలకు మించకూడదు. మే 20లోగా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానాల్లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రవేశపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. హైదరబాద్‌లో మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు.


వివరాలు..


➥ డిప్లొమా ఇన్ టూల్‌, డై అండ్‌ మౌల్డ్‌ మేకింగ్‌ (డీటీడీఎం)


సీట్ల సంఖ్య: 60.


కోర్సు వ్యవధి: 4 సంవత్సరాలు.


అర్హత: 50 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. 


వయోపరిమితి: 20.05.2024 నాటికి 15 - 19 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.


➥ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ (డీఈసీఈ)


సీట్ల సంఖ్య: 60.


కోర్సు వ్యవధి: 3 సంవత్సరాలు.


అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.  


వయోపరిమితి: 20.05.2024 నాటికి గరిష్ఠ వయసు 19 సంవత్సరాలలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.


➥ డిప్లొమా ఇన్ ఆటోమేషన్ అండ్‌ రోబోటిక్స్‌ ఇంజినీరింగ్‌ (డీఏఆర్ఈ)


సీట్ల సంఖ్య: 60.


కోర్సు వ్యవధి: 3 సంవత్సరాలు.


అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 


వయోపరిమితి: 20.05.2024 నాటికి గరిష్ఠ వయసు 19 సంవత్సరాలలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.


➥ డిప్లొమా ఇన్‌ ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌ (డీపీఈ)


సీట్ల సంఖ్య: 60.


కోర్సు వ్యవధి: 3 సంవత్సరాలు.


అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 


వయోపరిమితి: 20.05.2024 నాటికి గరిష్ఠ వయసు 19 సంవత్సరాలలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులు రూ.800. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా.


ఎంపిక విధానం: సీఐటీడీ ప్రవేశ పరీక్ష ఆధారంగా.


పరీక్ష విధానం: రాతపరీక్షలో 10వ తరగతి స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు. మ్యాథమెటిక్స్, సైన్స్, ఇంగ్లిష్, ఆప్టిట్యూడ్ & జనరల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సబ్జెక్టు నుంచి సమానంగా ప్రశ్నలు అడుగుతారు. మల్టీపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు.


ఆఫ్‌లైన్ దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Principal Director,
CITD, Balanagar, 
Hyderabad - 500 037.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 20.05.2024.


➥ ప్రవేశ పరీక్ష: 26.05.2024.


Notification


Prospectus


Online Application


Website


ALSO READ:


జాతీయ విద్యాసంస్థల్లో ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సులు - నోటిఫికేషన్, పరీక్ష వివరాలు ఇలా
దేశంలోని ఐఐటీలు, ఎన్‌ఐటీలు, సెంట్రల్‌ వర్సిటీల్లో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సులో ప్రవేశాలకు 2024-25 విద్యా సంవత్సరానికిగాను 'నేషనల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(NCET)-2024' నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇటీవల విడుదల  చేసింది. ఇంటర్‌ లేదా తత్సమాన విద్యార్హత కలిగిన విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 13న ప్రారంభంకాగా.. ఏప్రిల్ 30 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్నవారికి జూన్ 12న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్షలో ర్యాంకు ఆధారంగా ఆయా సంస్థలు ప్రవేశాల కౌన్సెలింగ్‌ నిర్వహించి నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ITEP) బీఈడీ సీట్లను భర్తీ చేస్తాయి. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..