సీబీఎస్‌ఈ విద్యార్థులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. అవకాశం ఉన్న చోటల్లా అందినకాడికి దోచుకుంటున్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పేరిట ఓ నకిలీ వెబ్‌సైట్ తెరిచి కొత్త దందాకు సైబర్ దొంగలు తెరతీశారు. రిజిస్ట్రేషన్ ఫీజు పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు దృష్టికి రావడంతో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) అప్రమత్తమైంది. ఇలాంటి నకిలీ వెబ్‌సైట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని విద్యార్థులకు ట్విటర్ వేదికగా ఫ్యాక్ట్‌చెక్ అలర్ట్ జారీ చేసింది.
ప్రస్తుతం cbsegovt.com పేరిట ఓ నకిలీ వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డు రిజిస్ట్రేషన్ కోసం డబ్బులు కట్టాలని ఫేక్ లింక్ చూపిస్తోందంటూ పీఐబీ దృష్టికి వచ్చింది. దీంతో ఈ సైట్‌కు ఎలాంటి అనుమతీ లేదని పీఐబీ స్పష్టం చేసింది.
కేవలం cbse.gov.in, cbse.nic.in మాత్రమే సీబీఎస్ఈకి చెందిన అధికారిక వెబ్‌సైట్లు అని తెలిపింది. పరీక్ష తేదీలు, డేటా షీట్లు, పరీక్షా ఫలితాలు మొదలైన సమాచారం కోసం అధికార వెబ్‌సైట్లను సంప్రదించాలని తెలిపింది. ఏదైనా సమాచారం తనిఖీ చేసేటప్పుడు ఆ వెబ్‌సైట్ సరైందా? కాదా? అనేది సరిచూసుకోవాలని పీఐబీ సూచించింది.
Also Read:
జేఈఈ మెయిన్ 2023 నోటిఫికేషన్ విడుదల
జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. రెండు విడతల్లో పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. తొలి విడత పరీక్షలు జనవరి 24, 25, 27, 28, 29, 30, 31 తేదీల్లో నిర్వహిస్తామని వెల్లడించింది. రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. జనవరి 12 వరకు తొలి విడత జేఈఈ మెయిన్ దరఖాస్తుల స్వీకరించనున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని తెలిపింది.
నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
నీట్-2023 పరీక్ష తేది, రిజిస్ట్రేషన్ షెడ్యూల్ త్వరలో విడుదల! పరీక్ష వివరాలు ఇలా!
నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) యూజీ 2023 పరీక్ష తేదీలను డిసెంబరు చివరివారంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసే అవకాశం ఉంది. నీట్ యూజీ-2022 ప్రకటన వెలువడిన తర్వార అధికారిక వెబ్‌సైట్‌లో నీట్ పరీక్ష తేదీలతోపాటు పరీక్ష సిలబస్, అప్లికేషన్ ఫామ్, ఇన్‌ఫర్మేషన్ బులిటన్, పరీక్ష పూర్తి స్వరూపం గురించి అందుబాటులో ఉంచనున్నారు. వచ్చే ఏడాది మే నెలలో నీట్ యూజీ-2023 ప్రవేశ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. నీట్ పరీక్ష 13 భాషల్లో పెన్ అండ్ పేపర్ మోడ్‌లో, ఆఫ్ లైన్ లో నిర్వహిస్తారు. నీట్ పరీక్ష వ్యవధి మూడు గంటల 20 నిమిషాలు. ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మలయాళం, కన్నడ, మరాఠి, ఒడియా, తమిళం, తెలుగు, ఉర్దూ, పంజాబీ భాషల్లో పరీక్ష ఉంటుంది.
నీట్ యూజీ-2023 వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..