సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ (CBSE) 2026 సంవత్సరానికి సంబంధించిన 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షల కోసం అభ్యర్థుల జాబితా (LOC) సబ్మిట్ పోర్టల్‌ను తిరిగి ప్రారంభించింది. చాలా స్కూళ్లు పలుమార్లు గుర్తు చేసినా డెడ్‌లైన్ తేదీలను పాటించలేదు. రాబోయే పరీక్షలకు సంబంధించిన తాత్కాలిక తేదీ షీట్‌లను సీబీఎస్ఈ బోర్డు విడుదల చేసింది. 17 ఫిబ్రవరి నుంచి 15 జూలై 2026 మధ్య పరీక్షలు నిర్వహిస్తారు. భారతదేశం, విదేశాలలో 26 దేశాలలో దాదాపు 45 లక్షల మంది విద్యార్థులు 204 సబ్జెక్టులలో పరీక్షలకు హాజరు కానున్నారు.
పలు రిమైండర్‌లు జారీ
CBSE మొదట 27 ఆగస్టు 2025న LOC సమర్పణకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆ తర్వాత ఖచ్చితమైన సబ్మిట్ నిర్ధారించడానికి పాఠశాలలకు పలు సర్క్యులర్‌లు, రిమైండర్‌లు పంపించింది.
- 9 సెప్టెంబర్ 2025: CWSN అభ్యర్థుల కోసం వెబ్ మాడ్యూల్ యాక్టివేషన్‌తో సహా ముఖ్యమైన తేదీలతో సర్క్యులర్
- 11 సెప్టెంబర్ 2025: స్కూళ్లకు మొదటి రిమైండర్
- 18 సెప్టెంబర్ 2025: సరైన డేటా, సబ్జెక్ట్ సమర్పణను హైలైట్ చేస్తూ తల్లిదండ్రులకు సర్క్యులర్
- 19 సెప్టెంబర్ 2025: పాఠశాలలకు 2వ సారి రిమైండర్
- 25 సెప్టెంబర్ 2025: LOC సబ్మిట్, ఫీజు చెల్లింపును పరిష్కరించే మూడవ రిమైండర్
- 26–30 సెప్టెంబర్ 2025: మిగిలిన సబ్మిట్ విండోను ప్రస్తావిస్తూ రోజువారీ రిమైండర్‌లు
మొత్తం మీద CBSE LOC ప్రక్రియపై పాఠశాలలకు మార్గనిర్దేశం చేస్తూ 8 కమ్యూనికేషన్‌లను జారీ చేసింది. ఆలస్య రుసుము (Late Fees) లేకుండా సమర్పణల కోసం పోర్టల్ మొదట 30 సెప్టెంబర్ 2025న మూసివేశారు.
రీఓపెన్ అయిన పోర్టల్, సబ్మిట్ గడువులు
సీబీఎస్ఈ పోర్టల్ ఇప్పుడు రీఓపెన్ చేశారు. ఆలస్య రుసుముతో విద్యార్థుల వివరాలను సమర్పించడానికి పాఠశాలలను అనుమతిస్తుంది. సబ్మిట్ షెడ్యూల్ ఈ విధంగా ఉంది:
చలాన్ ద్వారా చెల్లింపుల గడువు: 3–8 అక్టోబర్ 2025, రాత్రి 11:59 వరకు
ఇతర చెల్లింపు విధానాలు (ఇంటర్నెట్ బ్యాంకింగ్, UPI, డెబిట్/క్రెడిట్ కార్డ్, NEFT/RTGS, SWIFT): అక్టోబర్ 3–11 తేదీలు 2025, రాత్రి 11:59 వరకు
తమ LOCలను ఇంకా సమర్పించని ప్రిన్సిపాల్స్ నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని CBSE ఆదేశించింది. 2026 బోర్డు పరీక్షలకు అర్హత సాధించడంలో పాఠశాలలు విఫలమైతే, అభ్యర్థులను అనర్హులుగా పరిగణిస్తారు.
పరీక్షలు, వాల్యుయేషన్ ప్రక్రియ
2026 షెడ్యూల్‌లో ఇవి ఉంటాయి:
- 10వ తరగతి, 12 తరగతులకు ప్రధాన పరీక్షలు
- స్పోర్ట్స్ విద్యార్థుల కోసం పరీక్షలు (12వ తరగతి)
- సెకండరీ బోర్డు పరీక్షలు (10వ తరగతి)
- సప్లిమెంటరీ పరీక్షలు (12వ తరగతి)
రాత పరీక్షలతో పాటు, ప్రాక్టికల్స్, పేపర్ల వాల్యుయేషన్, ఫలితాల తర్వాత ప్రక్రియలు సకాలంలో ఫలితాలను ప్రకటించనున్నారు. ప్రతి పరీక్ష తర్వాత సుమారు 10 రోజుల తర్వాత సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రారంభమవుతుంది. 12 రోజుల్లో ముగుస్తుందని CBSE తెలిపింది. 12వ తరగతి ఫిజిక్స్ పరీక్ష 20 ఫిబ్రవరి 2026న నిర్వహిస్తే.. పేపర్ వాల్యుయేషన్ 3 మార్చి నుండి ప్రారంభమై 15 మార్చి నాటికి ముగుస్తుంది. పాఠశాలలు తమ తుది అభ్యర్థుల జాబితాను సమర్పించిన తర్వాతే ఈ డేట్ షీట్‌లు తాత్కాలికమని బోర్డు స్పష్టం చేసింది.