సీబీఎస్‌ఈ 9, 11వ తరగతుల రిజిస్ట్రేషన్ గడువును అక్టోబరు 25 వరకు పొడిగించారు. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే ఏడాది సీబీఎస్‌ఈ 9, 11వ తరగతి పరీక్షలకు హాజరయ్యేవారు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోనివారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత ఆలస్య రుసుముతో అక్టోబరు 26 నుంచి 29 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు.


CBSE క్లాస్ 9, 11 పరీక్ష 2024 కోసం రిజిస్ట్రేషన్ ఇలా..


రిజిస్ట్రేషన్ కోసం విద్యార్థులు మొదట CBSE పరీక్షా సంగం పోర్టల్‌నను సందర్శించాలి: CBSE 9వ, తరగతి మరియు 11వ పరీక్ష 2024 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ CBSE పరీక్షా సంగం పోర్టల్ర్ట ద్వారా ఆన్‌లైన్ విధానంలోనే జరుగుతుంది.


పోర్టల్: https://parikshasangam.cbse.gov.in/


➥ విద్యార్థులు మొదటగా తమ పాఠశాల అఫీలియేషన్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు ఉపయోగించి CBSE పరీక్షా సంగం పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి. పాఠశాలకు ఖాతా లేకుంటే, వారు పోర్టల్‌లో ఖాతా సృష్టించవచ్చు.


➥ ఒకసారి లాగిన్ అయిన తర్వాత, విద్యార్థులు రిజిస్ట్రేషన్ ఫామ్ పూరించాలి. ఫామ్‌లో విద్యార్థులు తమ పేరు, పుట్టినట్టి తేదీ, లింగం, చిరునామా, తదితర  ప్రాథమిక వివరాలు నమోదుచేయాల్సి ఉంటుంది. 


➥ విద్యార్థులు తాము నమోదు చేసుకోవాలనుకునే సబ్జెక్టుబ్జెక్టులను కూడ ఎంపికచేసుకోవచ్చు.


➥ విద్యార్థులు తమ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సంతకం, పాఠశాల గుర్తింపు కార్డు స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయాలి.


➥ దరఖాస్తులో అన్ని పూరించిన తర్వాత అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసిన తర్వాత, రిజిస్ట్రేషన్‌ ఫామ్‌ను SUBMIT చేయాల్సి ఉంటుంది.



ALSO READ:


ఇంటర్‌ పాసైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, దరఖాస్తుకు డిసెంబరు 31 వరకు గడువు
తెలంగాణలో ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులై... ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు 'నేషనల్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌'కు దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌మిత్తల్‌ అక్టోబరు 6న ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబరు 31 వరకు గడువు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఇంటర్‌ మార్కుల్లో టాప్‌-20 పర్సంటైల్‌లో నిలిచిన 53,107 మంది ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ఆయన పేర్కొన్నారు. కొత్త విద్యార్థులతోపాటు గతంలో స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన వారు కూడా రెన్యువల్‌ కోసం డిసెంబరు 31లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ఇంటర్‌ విద్యార్థులకు 'స్టడీ అవర్స్', వారికి 'హాజరు' ఫీజు గడువు నవంబరు 30 వరకు
ఏపీలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సాయంత్రం స్టడీ అవర్‌ నిర్వహించాలని ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి సౌరబ్‌ గౌర్‌ అక్టోబరు 2న ఆదేశాలు జారీ చేశారు. ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు విద్యార్థులను చదివించాలని, ఆ సమయంలో విద్యార్థుల హాజరు నమోదు చేసి జిల్లా వృత్తివిద్యాధికారులకు పంపించాలని సూచించారు. సోమవారం నుంచి శనివారం వరకు ఏ రోజు ఏ సబ్జెక్టు చదివించాలనే వివరాలు సైతం తెలిపారు. వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించే ఇంటర్మీడియట్‌ పరీక్షలకు హాజరయ్యే ప్రైవేటు విద్యార్థులకు హాజరు మినహాయింపునిస్తూ ఇంటర్‌ విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...