కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు (CBSE) 12వ తరగతి ఫలితాలను బుదవారం విడుదల చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను, మార్క్‌షీట్‌లను CBSE అధికారిక వెబ్‌సైట్లు cbse.gov.in , results.cbse.nic.in లో అందుబాటులో ఉన్న డైరెక్ట్ లింక్ ద్వారా తనిఖీ చేసుకోవచ్చు. https://cbseresults.nic.in/

Continues below advertisement

ఆన్‌లైన్‌తో పాటు ఇంటర్ విద్యార్థులు ఇంటర్నెట్ లేకుండా కూడా తమ ఫలితాలను తెలుసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈసారి మొత్తం ఉత్తీర్ణత శాతం 85.20 శాతంగా నమోదైంది. గత ఏడాది ఈ గణాంకం 88.39 శాతంగా ఉంది. ఈ ఏడాది సుమారు 3.19 శాతం తగ్గుదల నమోదైంది. పేపర్ స్థాయి, కఠినమైన వాల్యుయేషన్, కొత్త డిజిటల్ ప్రక్రియ ఈ మార్పునకు కారణం కావచ్చునని నిపుణులు భావిస్తున్నారు.

ఎంత మంది విద్యార్థులు పరీక్ష రాశారు?ఈ ఏడాది 17 లక్షల కంటే ఎక్కువ మంది విద్యార్థులు పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 16.8 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల్లో దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు పాస్ అయినట్లు ప్రకటించారు. ఇంత భారీ సంఖ్యలో విద్యార్థులు ఉండటం అనేది దేశంలోని అతిపెద్ద విద్యా కార్యక్రమాలలో ఈ బోర్డు పరీక్ష ఒకటని తెలియజేస్తోంది. 

Continues below advertisement

బాలికలదే పైచేయి ప్రతి ఏటా లాగే ఈసారి కూడా అమ్మాయిలే పైచేయి సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 88.86 శాతం కాగా, బాలురది 82.13 శాతం. అంటే అమ్మాయిలు సుమారు 6.73 శాతం ముందున్నారు. ఈ వ్యత్యాసం కేవలం అంకెలు మాత్రమే కాదు, చదువులో అమ్మాయిల ఫలితాలు పెరగడం మార్పును సూచిస్తుంది. 

టాప్ రీజియన్లు ఏవి?తిరువనంతపురం (కేరళ): అత్యధికంగా సుమారు 99 శాతం ఉత్తీర్ణతతో అద్భుతం చేసింది. 

విజయవాడ, చెన్నై: ఇవి కూడా టాప్ రీజియన్లలో చోటు దక్కించుకున్నాయి. 

ప్రయాగ్‌రాజ్, పాట్నా వంటి ప్రాంతాల ప్రదర్శన చాలా తక్కువగా ఉంది. అక్కడ మెరుగుపడాల్సిన అవసరం చాలా ఉంది. 

ఢిల్లీలో ప్రదర్శనదేశ రాజధాని ఢిల్లీ ఫలితాలు కూడా సంతృప్తికరంగా ఉన్నాయి.

ఢిల్లీ వెస్ట్: సుమారు 92.3 శాతం

ఢిల్లీ ఈస్ట్: సుమారు 91.73 శాతం

ఓవరాల్ ఢిల్లీ: సుమారు 91.9 శాతం

డిజిటల్ వ్యవస్థతో వచ్చిన మార్పుఈ ఏడాది ఫలితాల ప్రక్రియలో అతిపెద్ద ప్రత్యేకత పేపర్ల మూల్యాంకనంలో కొత్త విధానం అమలు చేస్తున్నారు. సీబీఎస్ఈ బోర్డు On-Screen Marking (OSM) వ్యవస్థను అమలు చేసింది. దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఇలా ఉన్నాయి. 

పేపర్లు ఆన్‌లైన్‌లో మూల్యాంకనం చేశారు. 

మానవ తప్పిదాల అవకాశం పూర్తిగా తగ్గింది.

రిజల్ట్స్ కోసం టైం ఆదా అయ్యింది.

మొత్తం ప్రక్రియ మరింత పారదర్శకంగా మారింది.

UMANG యాప్ ద్వారా ఫలితాలుUMANG యాప్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వాలి

సెర్చ్ బాక్స్‌లో CBSE Service అని సెర్చ్ చేయండి.

“Class 12 Result” ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

మీ వివరాలను ఫిల్ చేయగానే ప్రొవిజనల్ మార్క్‌షీట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

విద్యార్థులు దీనిని డౌన్‌లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవాలి.

DigiLocker ద్వారా ఫలితాల చెక్ చేయండి- విద్యార్థులు DigiLocker యాప్ లేదా digilocker.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లండి.

- నమోదిత మొబైల్ నంబర్ లేదా ఇతర ఐడెంటిటీ వివరాలతో లాగిన్ అవ్వండి.

- తరువాత Education సెక్షన్‌లోకి వెళ్లి CBSEని ఎంచుకోండి.

- అక్కడ “Class 12 Marksheet” పై క్లిక్ చేయండి.

- రోల్ నంబర్, అవసరమైన సమాచారాన్ని ఫిల్ చేయగానే మార్క్‌షీట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఆ షీట్ డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసిపెట్టుకోవడం మంచిది.