CBSE Exams: విద్యార్థులకు అలర్ట్, సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు!

12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు జరిగింది. ఏప్రిల్ 4న జరగాల్సిన పరీక్షలను మార్చి 27నే నిర్వహించనున్నారు. ఈ మేరకు సవరించిన షెడ్యూల్‌ను సీబీఎస్‌ఈ తాజాగా విడుదల చేసింది.

Continues below advertisement

సీబీఎస్‌ఈ 10,12 తరగతుల వార్షిక పరీక్షల షెడ్యూలును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం పదోతరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మొదలై మార్చి 21వరకు కొనసాగనుండగా.. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15న మొదలై ఏప్రిల్ 5 వరకు జరుగుతాయి. ఆయా తేదీల్లో ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. రెండు సబ్జెక్టుల మధ్య తగినంత గ్యాప్ ఇవ్వడంతో పాటు జేఈఈ మెయిన్ వంటి పోటీ పరీక్షలను పరిగణనలోకి తీసుకొని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పరీక్షల షెడ్యూలును రూపొందించింది. కాగా.. 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు జరిగింది. ఏప్రిల్ 4న జరగాల్సిన పరీక్షలను మార్చి 27నే నిర్వహించనున్నారు. ఈ మేరకు సవరించిన షెడ్యూల్‌ను సీబీఎస్‌ఈ తాజాగా విడుదల చేసింది. కేవలం ఒకరోజు జరిగే పరీక్ష తేదీలో మాత్రమే మార్పు జరిగిందని సీబీఎస్‌ఈ వెల్లడించింది. 12వ తరగతి మిగతా పరీక్షలు, పదోతరగతి పరీక్షల షెడ్యూల్ డిసెంబరు 29న ప్రకటించినట్లుగానే ఉంటుందని స్పష్టం చేసింది. 

Continues below advertisement

సీబీఎస్‌ఈ క్లాస్-10, 12 తరగతుల పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

Also Read

ఏపీ పదోతరగతి పరీక్షల షెడ్యూలు విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?
ఏపీలో పదోతరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటించింది. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఏపీలో 6 పేపర్లతో పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్త విధానం ప్రకారం పది పరీక్షల మాదిరి ప్రశ్నపత్రాలు, బ్లూప్రింట్‌, ప్రశ్నల వారీగా వెయిటేజీ వివరాలను బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లో ఇప్పటికే అందుబాటులో ఉంచింది.
పదోతరగతి వార్షిక పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

తెలంగాణ పదోతరగతి పరీక్షల పూర్తి షెడ్యూలు ఇదే! క్వశ్చన్ పేపర్ ఇలా!
తెలంగాణలో పదోతరగతి పరీక్షల షెడ్యూలును ప్రకటించిన సంగతి తెలిసిందే. షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ 3న ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 11తో ప్రధాన పరీక్షలు, 13న ఒకేషనల్ పరీక్షలు ముగియనున్నాయి. ఆయాతేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్‌ పరీక్షకు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 వరకు, ఒకేషనల్ కోర్సుకు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతాయి. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు దాదాపు 5.50 లక్షల మంది విద్యార్థలు హాజరుకానున్నారు.
పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి.. 

ఏపీ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, తేదీల వివరాలివే!
ఏపీలో ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూలును ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు డిసెంబరు 26న ప్రకటించింది. షెడ్యూలు ప్రకారం 2023 మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 3 వరకు నిర్వహించనున్నారు. అదేవిధంగా మార్చి 16 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగనున్నాయి.
ఏపీ ఇంటర్ పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, తేదీల వివరాలివే!
తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ తాజాగా విడుదల చేసింది. 2023 మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 15న ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్, మార్చి 16న సెకండియర్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ షెడ్యూల్ కూడా ప్రకటించారు. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు తెలంగాణలో ఇంటర్‌ విద్యార్థులకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నామని బోర్డ్ వెల్లడించింది. 
తెలంగాణ ఇంటర్ పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Continues below advertisement