ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) లక్నో క్యాట్-2023 పరీక్ష హాల్‌టికెట్లను నవంబరు 7న విడుదల చేసింది. క్యాట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నవారు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. షెడ్యూలు ప్రకారం.. నవంబరు 26న 'CAT - 2023' పరీక్ష నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ నగరాల్లో పరీక్ష నిర్వహించనున్నారు.

CAT- 2023 అడ్మిట్ కార్డులు ఇలా డౌన్‌చేసుకోవాలి..

➦ CAT 2023 అడ్మిట్ కార్డు (హాల్‌టికెట్) కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావాలి.- iimcat.ac.in

➦ అక్కడ 'Download CAT 2023 Admit Card' లింక్‌పై క్లిక్ చేయాలి.

➦ అభ్యర్థి తన యూజర్ ఐటీ, పాస్‌వర్డ్ వివరాలతో సైన్ ఇన్ కావాలి.

➦ క్లిక్ చేయగానే అభ్యర్థి హాల్‌టికెట్ వస్తుంది.

➦ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి.

➦ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి.

CAT  2023 అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి..

పరీక్ష విధానం..కంప్యూటర్ ఆధారిత పరీక్ష 2 గంటలపాటు సాగనుంది. పరీక్షలో మూడు సెక్షన్లు ఉంటాయి. వీటి నుంచి 66 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో సెక్షన్‌కు 40 నిమిషాల సమయం చొప్పున 120 నిమిషాల సమయం ఉంటుంది. దివ్యాంగులకు 13 నిమిషాల అదనపు సమయం కేటాయిస్తారు. ప్రతిప్రశ్నకు 3 మార్కులు ఉంటాయి. నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. క్యాంట్ స్కోరుకు 2023 డిసెంబరు 31 వరకు వ్యాలిడిటీ ఉంటుంది. 

➥ సెక్షన్-1: వెర్బల్ ఎబిలిటీ & రీడింగ్ కాంప్రహెన్షన్ -  24 ప్రశ్నలు – 72 మార్కులు.

➥ సెక్షన్-2: డేటా ఇంటర్ ప్రిటేషన్ & లాజికల్ రీజనింగ్ - 20 ప్రశ్నలు – 60 మార్కులు

➥ సెక్షన్-3: క్వాంటిటేటివ్ ఎబిలిటీ - 20 ప్రశ్నలు – 60 మార్కులు.

CAT 2023 Information Bulletin

Scoring and Equating Process

రికార్డు స్థాయిలో దరఖాస్తులు..దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) లలో ప్రవేశాలకు వీలు కల్పించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)-2023 ప్రవేశ పరీక్షకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో దరఖాస్తు చేసుకున్నారు. నవంబరు 26న జరిగే పరీక్షకు మొత్తం సుమారు 3.30 లక్షల మంది పోటీపడనున్నారు. గతేడాదితో పోల్చుకుంటే 31 శాతం పెరగడం విశేషం. ఈసారి మొత్తం అభ్యర్థుల్లో 1.17 లక్షల మంది అమ్మాయిలున్నారు.  క్యాట్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ ప్రక్రియ అక్టోబర్ 25 నుంచి నవంబర్ 26 వరకు ఉంటుంది. నవంబర్ 26న క్యాట్ పరీక్షను మూడు సెషన్లలో నిర్వహించనున్నారు. 2024 జనవరి రెండో వారంలో పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈసారి పరీక్షను ఐఐఎం లక్నో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఐఐఎం క్యాంపస్‌లు ఇవే.. క్యాట్ 2023 పరీక్ష ద్వారా విశాఖపట్నం, అహ్మాదాబాద్, బెంగళూరు, కలకతా, జమ్మూ, బోద్ గయ, ఉదయపూర్, తిరుచిరాపల్లి, కోజికాడ్, అమృత్‌సర్, రాయ్‌పూర్, నాగ్‌పూర్, కాశీపూర్, లక్‌నవూ, రాంచీ, రోహ్‌తక్, షిల్లాంగ్, ఇండోర్, సంబాల్‌పూర్, సిర్‌మౌర్ ఐఐఎం క్యాంపస్‌లలో ప్రవేశాలు పొందవచ్చు.