Mera Yuva Bharat: దేశంలోని 40 కోట్ల యువతకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.  యువత నైపుణ్యాభివృద్ధి, వారిలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే లక్ష్యంగా 'మేరా యువ భారత్(మై భారత్)' పేరిట ఒక స్వయంప్రతిపత్తి కలిగిన వేదిక ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా అక్టోబర్ 31న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాతో పంచుకున్నారు.


➥ యువత నైపుణ్యాభివృద్ధికి ఒక డిజిటల్ వేదికను తీసుకురావడమే మై భారత్ ప్రాథమిక లక్ష్యమని ఠాకూర్ వెల్లడించారు. యువత తమకు కావాల్సిన అవకాశాలను పొందడంతో పాటు సుసంపన్న భారత్ ఏర్పాటుకు ప్రభుత్వానికి, పౌరులకు మధ్య వారధులుగా వ్యవహరిస్తారని తెలిపారు. 


➥ ఈ వేదిక ద్వారా 15-29 మధ్య వయసు ఉన్న వారికి ప్రయోజనం చేకూరుతుందని మంత్రి తెలిపారు. 


➥కేబినెట్ భేటీలో కొన్ని ఖనిజాలకు సంబంధించి రాయల్టీ రేట్లను నిర్ణయించారు. లిథియం, నియోబియం ఖనిజాలకు 3 శాతం, అరుదుగా లభించే ఖనిజానికి 1 శాతం చొప్పున రాయల్టీ విధించేందుకు కేంద్ర * కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ  మూడు ఖనిజాలకు దేశంలోనే తొలిసారిగా కేంద్రం వేలం నిర్వహించబోతోంది.


ALSO READ:


సీబీఎస్ఈ 10, 12వ తరగతుల పరీక్షలపై కేంద్రం కీలక నిర్ణయం
దేశంలో ఏటా రెండుసార్లు నిర్వహించాలనుకుంటున్న సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలకు రెండింటికీ హాజరవడం తప్పనిసరేమీ కాదని కేంద్రం స్పష్టం చేసింది. విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించేందుకు మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ తెలిపారు. ఈ మేరకు అక్టోబరు 8న పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. సంవత్సరానికి పరీక్ష రాసే అవకాశం ఒక్కసారే ఉంటుందనే కారణంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, అందుకే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని మంత్రి వివరించారు. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ తరహాలో విద్యార్థులు సంవత్సరానికి రెండుసార్లు 10, 12వ తరగతి బోర్డు పరీక్షలు రాసుకోవచ్చు. వీటిల్లో వచ్చిన ఉత్తమ మార్కులను విద్యార్థులు​ ఎంచుకోవచ్చు. ఇది పూర్తిగా ఐచ్ఛికం. ఇందులో బలవంతం ఏమీ లేదు. ఈ విధానం 2024 నుంచి అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి అన్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


విద్యార్థులకు 'ప్రత్యేక గుర్తింపు సంఖ్య', త్వరలోనే అమల్లోకి కొత్త విధానం!
దేశంలో కేజీ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థుల సమగ్ర వివరాలు ఒకే గొడుగు కిందకు రానున్నాయి. విద్యార్థి ఎల్‌కేజీలో చేరినప్పట్నుంచి విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు.. వీటికి సంబంధించిన పూర్తివివరాలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు వీలుగా కేంద్ర విద్యాశాఖ చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా ఒక్కో విద్యార్థికి, ఒక్కో ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించాలని నిర్ణయించింది. దాన్ని ఆధార్ సంఖ్యతోపాటు 'అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్(ఏబీసీ)' అనే ఎడ్యులాకర్‌కు అనుసంధానించనుంది. ఈ విధానం త్వరలోనే అమల్లోకి తేనున్నారు. పాఠశాల విద్యలోని పిల్లలకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇచ్చే విధానాన్ని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 'ఛైల్డ్ ఇన్ఫో' పేరిట ఒక్కో విద్యార్థికి, ఒక్కో సంఖ్య విధానాన్ని గత కొన్నేళ్లుగా అమలు చేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర విద్యాశాఖ మరొకటి ఇవ్వబోతోంది. ఆ విధానం అమల్లోకి వచ్చే పక్షంలో కేంద్రం ఇచ్చే నంబరు ఒక్కటే సరిపోతుంది. దేశవ్యాప్తంగా 1-12వ తరగతి వరకు 26 కోట్ల మంది విద్యార్థులున్నందున 17 అంకెలున్న సంఖ్యను ఇచ్చే అవకాశం ఉంది. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...