CA Foundation December Results: సీఏ ఫౌండేషన్ డిసెంబరు 2023 ఫలితాలను చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 7న విడుదల  చేయనుంది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. విద్యార్థులు రూల్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. డిసెంబరు 31 నుంచి జనవరి 6 వరకు నిర్వహించిన సీఏ ఫౌండేషన్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-1, పేపర్-2 పరీక్షలు నిర్వహించారు.  దేశవ్యాప్తంగా 280 నగరాల్లో, విదేశాల్లో 8 నగరాల్లో ఏర్పాటుచేసిన కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. 


పరీక్షలో కనీస అర్హత మార్కులకు 50 శాతంగా నిర్ణయించారు. అయితే ఒక్కో సబ్జెక్టులో కచ్చితంగా 40 శాతం మార్కులకు తగ్గకుండా ఉండాలి. మరోవైపు సీఏ ఫౌండేషన్ జూన్ పరీక్షలకు ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. విద్యార్థులు ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. సీఏ ఇంటర్, ఫైనల్ ఫలితాలను జనవరి 9న విడుదలచేసిన ఐసీఏఐ తాజాగా ఫౌండేషన్ ఫలితాలను విడుదల చేసింది. 


సీఏ ఫౌండేషన్ ఫలితాలు ఇలా చూసుకోండి..


➥ ఫలితాల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావాలి.- https://www.icai.org/


➥ అక్కడ హోంపేజీలో కనిపించే 'Important Announcements' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.


➥ తర్వాత 'Results of the CA Foundation December 2023/January 2024' లింక్ మీద క్లిక్ చేయాలి.


➥ ఫలితాలకు సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది. 


➥ అక్కడ విద్యార్థులు తమ రూల్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు.


➥ ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి.


పరీక్ష విధానం..
సీఏ ఫౌండేషన్ ప్రోగ్రామ్ అనేది ఐసీఏఐలో ఎంట్రీ లెవల్ కోర్సుగా పరిగణిస్తారు. ఇందులో ప్రధానంగా నాలుగు పేపర్లు ఉంటాయి. అవి ప్రిన్సిపల్స్ & ప్రాక్టీస్ ఆఫ్ అకౌంటింగ్, బిజినెస్ లా & బిజినెస్ కరెస్పాండెన్స్ & రిపోర్టింగ్, బిజినెస్ మ్యాథమెటిక్స్, లాజికల్ రీజనింగ్ & స్టాటిస్టిక్స్, బిజినెస్ ఎకనామిక్స్ & బిజినెస్ & కమర్షియల్ నాలెడ్జ్. ఈ పరీక్షలో అర్హత సాధించాలంటే, ప్రతి పేపరులో కనీసం 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. మొత్తంగా 50 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.


ALSO READ:


IISc: ఐఐఎస్సీ బెంగళూరులో పీజీ, పీహెచ్‌డీ కోర్సులు - వివరాలు ఇలా
బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) 2024-25 విద్యా సంవత్సరానికి పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. పీజీ కోర్సులకు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశాలకు సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ అర్హత ఉండాలి. కోర్సును అనుసరించి వ్యాలిడ్‌ గేట్ స్కోరు/ జీప్యాట్‌ స్కోరు, నెట్‌ జేఆర్‌ఎఫ్‌, సీడ్‌, క్యాట్‌/ జీమ్యాట్‌, జామ్‌ స్కోరు సాధించి ఉండాలి. చివరిసంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోర్సుల ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 5న ప్రారంభంకాగా.. మార్చి 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.800 చెల్లించాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.400; ఈఆర్‌పీ (ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్) అభ్యర్థులు రూ.2000 చెల్లించాల్సి ఉంటంది.
కోర్సుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...